Showing posts with label శాంతినివాసం --- 1960. Show all posts
Showing posts with label శాంతినివాసం --- 1960. Show all posts

Tuesday, July 29, 2014

శాంతి నివాసం--1960::హంసధ్వని::రాగం



సంగీతం::ఘంటసాల
రచన:::సముద్రాలరామానుచార్య జూనియర్ 
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంతారావు,దేవిక,రాజసులోచన,నాగయ్య,రేలంగి,రమణారెడ్డి 
హంసధ్వని::రాగం 

పల్లవి::

శ్రీరామ చంద్రహా..ఆశ్రిత పారిజాతహ
సమస్త కల్యాణ..గుణాభి రామాహా
సీతా ముఖాంబోరుహ..చంచరీకహ
నిరంతరం మంగళ..మాత నోతూ..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం 
సీతామనోభిరాం..ఆ ఆ ఆ ఆ ఆ
శ్రీ రఘురాం జయరఘురాం 

చరణం::1

అన్నదమ్ముల ఆదర్శమైనా 
ఆలూమగల అన్యోన్యమైనా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అన్నదమ్ముల ఆదర్శమైనా 
ఆలూమగల అన్యోన్యమైనా
తండ్రిమాటను నిలుపుటకైనా 
ధరలో నీవే దశరధరాం 
శ్రీ రఘురాం జయరఘురాం 
సీతామనోభిరాం..ఆ ఆ ఆ ఆ
శ్రీ రఘురాం జయరఘురాం 

చరణం::2

వెలయు నే ఎద నీ దివ్య మూర్తీ 
వెలిగే నా ఎద ఆనందజ్యోతీ
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వెలయు నే ఎద నీ దివ్య మూర్తీ 
వెలిగే నా ఎద ఆనందజ్యోతీ
వెలసి మాగృహం శాంతినివాసం 
సలుపవె శుభగుణ శోభితరాం 
శ్రీ రఘురాం జయరఘురాం 
సీతామనోభిరాం.. ఆ ఆ ఆ ఆ
శ్రీ రఘురాం జయరఘురాం 
శ్రీ రఘురాం జయరఘురాం 
శ్రీ రఘురాం జయరఘురాం 

Santi nivaasam--1960
Music::Ghantasala
Lyrics::Samudralaraamaanuchaarya Junior 
Singer's::P.B.Sreenivaas,P.Suseela
Cast::Akkineni,Krishnakumari,Devika,Rajasulochana,Nagayya,RElangi,Ramanareddi.

Hamsadhwani::raagam 

::::

Sreeraama chandrahaa..ASrita paarijaataha
samasta kalyaaNa..guNaabhi raamaahaa
seetaa mukhaambOruha..chanchariikaha
nirantaram mangaLa..maata nOtuu..aa
aa aa aa aa aa aa aa aa aa 

Sree raghuraam jayaraghuraam
Sree raghuraam jayaraghuraam
Sree raghuraam jayaraghuraam 
seetaa manObhiraam..aa aa aa 
Sree raghuraam jayaraghuraam 

::::1

annadammula aadarSamainaa 
aaloomagala anyOnyamainaa 
aa aa aa aa aa aa aa aa aa
annadammula aadarSamainaa 
aaloomagala anyOnyamainaa
tanDrimaaTanu nilupuTakainaa 
dharalO neeve daSaradharaaM 

Sree raghuraaM jayaraghuraaM 
seetaamanObhiraaM 
Sree raghuraaM jayaraghuraaM 

::::2

velayu nee eda nee divya moortee 
velige naa eda aanaMdajyOtee 
velayu ne eda nee divya moortee 
veligae naa eda aanaMdajyOtee
velasi maagRhaM SaaMtinivaasaM 
salupave SubhaguNa SObhitaraaM 
Sree raghuraaM jayaraghuraaM 
seetaamanObhiraaM 
Sree raghuraaM jayaraghuraaM 
Sree raghuraaM jayaraghuraaM 

Sree raghuraaM jayaraghuraaM 

Thursday, February 14, 2013

శాంతినివాసం--1960::రాగేశ్రీ::రాగం


సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల రామానుజాచార్య
గానం::ఘంటసాల,P.సుశీల

రాగేశ్రీ::రాగం


పల్లవి::

ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

చరణం::1

పతి పదసేవయే 
యోగముగా
నాతికి పతియే
దైవముగా 

పతి పదసేవయే 
యోగముగా
నాతికి పతియే
దైవముగా

సతి సౌభాగ్యాలే 
తన భాగ్యమనే
భావనయే పతి ధర్మముగ

సతి సౌభాగ్యాలే 
తన భాగ్యమనే
భావనయే పతి ధర్మముగ

రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

చరణం::2

మాయని ప్రేమల 
కాపురమే
మహిలో వెలసిన 
స్వర్గముగా

మాయని ప్రేమల 
కాపురమే
మహిలో వెలసిన 
స్వర్గముగా

జతబాయని కూరిమి 
జంటగ మెలిగే
దంపతులే 
ఇల ధన్యులుగా

జతబాయని కూరిమి 
జంటగ మెలిగే
దంపతులే 
ఇల ధన్యులుగా


రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

Sunday, February 14, 2010

శాంతి నివాసం--1960::హిందోళం::రాగం


సంగీతం::ఘంటసాల గారు 
రచన::సముద్రాల 
గానం::P.లీల

హిందోళం::రాగం 

పల్లవి::

తుషార శీతల సరోవరాన 
అనంత నీరవ నిశీధిలోన 
ఈ కలువ నిరీక్షణ..ఆఆ..
నికొరకే..రాజా..వెన్నెల రాజ

కలనైన నీ వలపే
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

చరణం::1

కలువ మిటారపు కమ్మని కలలు
కలువ మిటారపు కమ్మని కలలు 
కళలు కాంతులు నీ కొరకేలే 
కళలు కాంతులు నీ కొరకేలే
చేలియారాజల సాజన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

చరణం::2

కనుల మనోరథ మాధురి దాచి..ఈ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కానుక చేసే వేలకు కాచి
కానుక చేసే వేలకు కాచి
వాడే రేకుల వీడని మమతల 
వేడుచు నీకై వేచి  నిలచెరా 

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

Monday, October 15, 2007

శాంతినివాసం--1960::శంకరాభరణం::రాగం


సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,P.లీల
(PG.కృష్ణవేణి,జిక్కి)

శంకరాభరణం::రాగం

కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే
నావంక రావేలనే చెలి నీకింక సిగ్గేలనే
నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా...నో నో నో...

కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనాము ఆనాడే జోడైతిని
ఇంత స్నేహానికి అంత ఆరాటమా
చాలులే తమరికి ఏలా ఈ తొందర
నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా...నో నో నో...

ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
నీవు నా దానవై నేను నీ వాడనై
నీడగా నిలిచినా చాలులే నా చెలి
కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే
నావంక రావేలనే చెలి నీకింక సిగ్గేలనే
నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా...నో నో నో...