Tuesday, February 17, 2015

మేలుకొలుపు--1978




సంగీతం::మాస్టర్ వేణు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::B.V.Prasad 
తారాగణం::N.T.రామారావు,జయప్రద,K.R.విజయ,చలం,నాగభూషణం,జయమాలిని.

పల్లవి::

కనరాని నీవే::కనిపించినావే
అనురాగ వీణ::పలికించినావే

కనరాని నీవే..అహా 
కనిపించినావే..ఆహా
అనురాగ వీణ..ఆ
పలికించినావే..ఆ

చరణం::1

కలలన్ని నేడు..నిజమాయె చూడు
కలలన్ని నేడు..నిజమాయె చూడు
ఏనాటికైనా..విడిపోదు తోడూ 

ఇన్నాళ్ళు నీకై..వేచాను నేను..ఊ
ఇనాళ్ళు నీకై..వేచాను నేను
ఎడబాటు దాటి చేరాను నిన్ను..చేరాను నిన్ను

ఉందాము మనము..ఒక గూటిలోనే
నడిచేము మనము..ఒక బాటలోనే

చరణం::2

మ్రోగింది అందె..నా రాజు కోసం
వేసింది చిందు..నా మూగ హృదయం

హృదయాలు రెండు..ఉయ్యాలలూగే
హృదయాలు రెండు..ఉయ్యాలలూగే
జత చేరి నేడు..సైయ్యాటలాడే

కనుపాపలాగా..నిను చూసుకోనా
పసిపాపలాగా..నిను దాచుకోనా
కనరాని నీవే..కనిపించినావే
అనురాగ వీణ..పలికించినావే 

Melukolupu--1978
Music::Master Venu
Lyrics::Dasarathi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::B.V.Prasad 
Cast::N.T.RamaRao,Jayaprada,K.R.Vijaya,Chalam,Naagabhooshanam,Jayamaalini.

:::::::::::::::

kanaraani neevE::kanipinchinaavE
anuraaga veeNa::palikinchinaavE

kanaraani neevE..ahaa 
kanipinchinaavE..aahaa
anuraaga veeNa..aa
palikinchinaavE..aa

::::1

kalalanni nEDu..nijamaaye chooDu
kalalanni nEDu..nijamaaye chooDu
EnaaTikainaa..viDipOdu tODuu 

innaaLLu neekai..vEchaanu nEnu..uu
inaaLLu neekai..vEchaanu nEnu
eDabaaTu daaTi chEraanu ninnu..chEraanu ninnu

undaamu manamu..oka gooTilOnE
naDichEmu manamu..oka baaTalOnE

::::2

mrOgindi ande..naa raaju kOsam
vEsindi chindu..naa mooga hRdayam

hRdayaalu renDu..uyyaalaloogE
hRdayaalu renDu..uyyaalaloogE
jata chEri nEDu..saiyyaaTalaaDE

kanupaapalaagaa..ninu choosukOnaa
pasipaapalaagaa..ninu daachukOnaa
kanaraani neevE..kanipinchinaavE
anuraaga veeNa..palikinchinaavE 

దత్తపుత్రుడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::కోసరజురాఘవయ్య 
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,వెన్నిరాడైనిర్మల,రమాప్రభ,సూర్యకాంతం. 

పల్లవి::


ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే   
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే   
మా చేను బంగారం పండిందిలే 

చరణం::1

ఏలూరు కాల్వకింద పాలంకి వెయ్యంగ
ఏలూరు కాల్వకింద పాలంకి వెయ్యంగ
K.C.కెనాలుకింద కేసరాలు చల్లంగ
K.C.కెనాలుకింద కేసరాలు చల్లంగ
నెలకు మూడు వానలూ నిలబెట్టీ కురవంగ
నెలకు మూడు వానలూ నిలబెట్టీ కురవంగ 
చెయ్యెత్తునా పైరు చెండించి పెరిగింది     
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

చరణం::2

నల్లగొండ బత్తుడుచే నాగళ్ళు చేయించి
నాగళ్ళు...చేయించి
కొండపల్లి కమ్మరిచే కొడవళ్ళు సరిపించి
కొడవళ్ళు....సరిపించి
దూపాటి గిత్తలచే దుక్కులు దున్నించాము
దూపాటి గిత్తలచే దుక్కులు దున్నించాము
మట్టిలో నూనెడు పోసి..పుట్టెడు పండించాము                  
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

చరణం::3

చెమట తీసి రైతు పాటు చెయ్యకపోతే
పాటు...చెయ్యకపోతే
గొమాత గుమ్మపాలు ఇయ్యక పోతే
గుమ్మపాలు...ఇయ్యక పోతే
కుక్కలనే పీక్కుతినే డొక్కల కరువొస్తుందీ
కుక్కలనే పీక్కుతినే డొక్కల కరువొస్తుందీ
తిని తిరెగే సోంబేరుల తిక్క వదిలి పోతుంది         
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

Monday, February 16, 2015

మూగమనసులు--1964



సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఈ నాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ

చరణం::1 

చుక్కలు పొదిగిన ఆకాశం
మక్కువలొలికే మనకోసం..మ్మ్
చుక్కలు పొదిగిన ఆకాశం
మక్కువలొలికే మనకోసం..మ్మ్

మంచు తెరలలో..మల్లెలతో
పందిరి మంచం వేసిందీ..ఈ
మంచు తెరలలో..మల్లెలతో
పందిరి మంచం వేసిందీ..ఈ
ఈ నాటి ఈబంధమేనాటిదో..ఓ

చరణం::2 

నీ కనుపాపల ఊయలలో
నే పసిపాపలా పవళిస్తా..ఆ
నీ కనుపాపల ఊయలలో
నే పసిపాపలా పవళిస్తా

నురాగము అనురాగమునే..ఏ
ఆలపించి నిను లాలిస్తా..ఆ
నురాగము అనురాగమునే..ఏ
ఆలపించి నిను లాలిస్తా

నీలో నాలో నేనేలే..ఏఏఏ
నీలో నాలో నేనేలే..ఏఏఏ 
మనలో మమతే చిరంజీవిలే
ప్రేమకు రూపం మనమేలే
ఈ నాటి ఈ బంధ మేనాటిదో..ఓఓఓ

చరణం::3

నీ సిగ విరజాజినై
నీ ఎద నెల రాజునై

నీ నగవుల రాసినై..ఈ
నీ మగసిరి దాసినై..ఈ

నీవూ నేనూ నిజమై రుజువై
నీవూ నేనూ నిజమై రుజువై
ఎన్ని యుగాలుగ ఉన్నామూ
ఎన్ని జన్మలు కన్నామో..ఓఓఓ

ఈ నాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ

Moogamanasulu--1964
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya-Atreya
Singer's::Ghantasala,P.Suseela
Cast::Akkineni,Savitri,Gummadi,Nagabhushanam.Jamuna,Padmanabham,Alluramalingayya.

::::::

ii naaTi ii bandhamEnaaTidO
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O

:::::1 

chukkalu podigina AkaaSam
makkuvalolikE manakOsam..mm
chukkalu podigina AkaaSam
makkuvalolikE manakOsam..mm

manchu teralalO..mallelatO
pandiri mancham vEsindii..ii
manchu teralalO..mallelatO
pandiri mancham vEsindii..ii
ii naaTi iibandhamEnaaTidO..O

::::2 

nee kanupaapala UyalalO
nE pasipaapalaa pavaListaa..aa
nee kanupaapala UyalalO
nE pasipaapalaa pavaListaa

nuraagamu anuraagamunE..E
Alapinchi ninu laalistaa..aa
nuraagamu anuraagamunE..E
Alapinchi ninu laalistaa

neelO naalO nEnElE..EEE
neelO naalO nEnElE..EEE 
manalO mamatE chiranjeevilE
prEmaku roopam manamElE
ii naaTi ii bandha mEnaaTidO..OOO

::::3

nee siga virajaajinai
nee eda nela raajunai

nee nagavula raasinai..ii
nee magasiri daasinai..ii

neevuu nEnuu nijamai rujuvai
neevuu nEnuu nijamai rujuvai
enni yugaaluga unnaamuu
enni janmalu kannaamO..OOO

ii naaTi ii bandhamEnaaTidO
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O

మాయాబజార్--1957



















సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::ఘంటసాల,P.లీల 
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,S.V..రంగారావు,రేలంగి,R.నాగేశ్వరరావు, 
C.S.R.ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి 

పల్లవి::

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

తారాచంద్రుల విలాసములతో 
విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో 
విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే 
పిల్ల వాయువుల లాలనలో
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::2

అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో..మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమానౌకలో హాయిగ చేసే విహారణలో

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::3

రసమయ జగమును రాసక్ఱీడకు 
ఉసిగొలిపే ఈ మధురిమలో..మధురిమలో
రసమయ జగమును రాసక్ఱీడకు 
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే 
చల్లని దేవుని అల్లరిలో

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

మాయాబజార్--1957


సంగీతం::ఘంటసాల
రచన::పింగళినాగేంద్రరావు 
గానం::ఘంటసాల,సావిత్రి 
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,S.V.రంగారావు,రేలంగి,R.నాగేశ్వరరావు, 
C.S.R.ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి 

పల్లవి::

సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
ఎందెందు వెదకిన లేదు కదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి..ఓహో సుందరి..ఆహా సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా

చరణం::1

దూరం దూరం..ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
ఆ..ఆ..ఆ..ఆ  
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా

అయ్యో..సుందరి..
ఆహా సుందరి..ఓహో సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన..లేదు కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా
సుందరి..ఆహా సుందరి..ఓహో సుందరి

చరణం::2

రేపటి దాకా ఆగాలి..ఆ
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
ఊ..
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేకదా

సుందరి..ఓహో సుందరి..ఆహ సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ వగల నా విరహము హెచ్చేకదా
సుందరి..ఆహా సుందరి..ఓహో సుందరి

చరణం::3

హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
ఊ..ఆ..
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా..
ఆ..ఆ..ఆ ఆ..ఆ..ఆ
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా 
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా

సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా
ఊ..అహ..సుందరి..సుందరి ఓహో సుందరి 
ఒహొ..సుందరి..ఊ..ఒహొ..సుందరి..ఓహో సుందరి

Sunday, February 15, 2015

రహస్యం--1967::రాగమాలిక



సంగీతం::ఘంటసాల
రచన::మల్లాది
గానం::ఘంటసాల
Film Director By::Vedantam Raghavaiah
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కృష్ణకుమారి,C.H..నారాయణరావు,S.V.రంగారావు,
B.సరోజాదేవి,గుమ్మడి,రమణారెడ్డి,G.వరలక్ష్మి,రాజశ్రీ,కృష్ణకుమారి,కాంతారావు,చిత్తూరునాగయ్య, 

పల్లవి::

లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా..సదయా జగదీశ్వరీ

సరస్వతీ::రాగం

లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా..సదయా జగదీశ్వరీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన..దేవి.ఈఈఈ 
సుమరదన విధువదన..దేవి..ఈఈఈ 

అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ..శ్రీ శారదాంబికే..ఏ
అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ..శ్రీ శారదాంబికే..ఏ

చరణం::1
శ్రీ::రాగం

శ్రీదేవి కైవల్య చింతామణి
శ్రీరాగ మోదిని చిద్రూపిని
శ్రీదేవి కైవల్య చింతామణి
శ్రీరాగ మోదిని చిద్రూపిని
బింబాధరా..రవి బింబాంతరా
రాజీవ రాజీవిలోలా..రాజీవ రాజీవిలోలా
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని..ఈఈఈ  
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని
శ్రీరాజరాజేశ్వరీ..ఈఈఈ 


చరణం::2
లలిత::రాగం

నిటలలోచన నయనతారా..తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన..అమలహసనా
అరుణవసన..అమలహసనా
మాడినీ..మనోన్మణి..ఈఈ 
నాదబింధు కళాధరీ బ్రామరీ..ఈఈ
నాదబింధు కళాధరీ బ్రామరీ..పరమేశ్వరీ
నాదబింధు కళాధరీ 
నాదబింధు కళాధరీ..బ్రామరీ..పరమేశ్వరీ

అమ్మాయి మనసు--1989


సంగీతం::రాజన్-నాగేంద్ర 
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు 
Film Directed By::Chekoori Krisha Rao
తారాగణం::చంద్రమోహన్,జయసుధ,శరత్‌బాబు,కాంతారావు,నిర్మల.

పల్లవి::

ఆహా..హా..ఆఆ..ఆ
ఓహో..లాలలలాల..ఆ..హా 
ఒక వేణుగీతం పలికింది పాటై
యెద పల్లవించగా ఈ వేళ నాలో హోయ్ 
 
ఒక వేణుగీతం..పలికింది పాటై..ఈఈఈ 
యెద పల్లవించగా..ఆ..ఈ వేళ నాలో
చిరుగాలి వీచినా..చిగురాకు రాలినా..ఆ
వలపు సంగీతమై..కదలాడు నాలో..హోయ్
ఒక వేణుగీతం..పలికింది పాటై..ఈఈ

చరణం::1

అలలై బంగారు కలలై..మిగిలే అందాలు కొన్ని
వనవాటిలోన సెలయేటిలాగ..నను తొందరించసాగే
యెదలో ఏ మూలలోనో..కదిలే భావాలు కొన్ని
నా గుండెనుంచి లోగొంతునుంచి..నా పెదవి పైకి చేరే..ఏ
లాలించే పాటలాగా..ఆ..ఆ..హో
ఒక వేణుగీతం..పలికింది పాటై
యెద పల్లవించగా..ఈ వేళ నాలో..ఓ

చరణం::2

హృదయం కోరేది స్నేహం..స్నేహం నూరేళ్ళ దీపం
మనసున్న మనిషి తోడైన వేళ..నీదే అందాల లోకం
ప్రణయం వసంతమైతే..బ్రతుకే పూదోట కాదా  
మనసులో మాట చూపులో తెలిసె..ఎందుకో ఇంక మౌనం
ఆ మౌనం ప్రేమ భాష్యం..హూమ్ 
  
ఒక వేణుగీతం..పలికింది పాటై
యెద పల్లవించగా..ఆ..ఈ వేళ నాలో
చిరుగాలి వీచినా..చిగురాకు రాలినా..ఆ
వలపు సంగీతమై కదలాడు నాలో..హో..ఓ
ఒక వేణుగీతం పలికింది పాటై..ఈఈఈ

Ammayi manasu--1989
Music::Rajan-Nagendra
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Balu 
Film Directed By::Chekoori Krisha Rao
Cast::Chandramohan,Jayasudha,Saratbabu,Kanta Rao,Nirmala.

:::::::::

aahaa..haa..aaaaaa..aa
OhO..laalalalaala..aa..haa 
oka vENugeetam palikindi paaTai
yeda pallavinchagaa ii vELa naalO hOy 
 
oka vENugeetam..palikindi paaTai..iiiiii 
yeda pallavinchagaa..aa..ii vELa naalO
chirugaali veechinaa..chiguraaku raalinaa..aa
valapu sangeetamai..kadalaaDu naalO..hOy
oka vENugeetam..palikindi paaTai..iiii

::::1

alalai bangaaru kalalai..migilE andaalu konni
vanavaaTilOna selayETilaaga..nanu tondarinchasaagE
yedalO E moolalOnO..kadilE bhaavaalu konni
naa gunDenunchi lOgontununchi..naa pedavi paiki chErE..E
laalinchE paaTalaagaa..aa..aa..hO

oka vENugeetam..palikindi paaTai
yeda pallavinchagaa..ii vELa naalO..O

::::2

hRdayam kOrEdi snEham..snEham noorELLa deepam
manasunna manishi tODaina vELa..needE andaala lOkam
praNayam vasantamaitE..bratukE poodOTa kaadaa  
manasulO maaTa choopulO telise..endukO inka maunam
aa maunam prEma bhaashyam..hoom 
  
oka vENugeetam..palikindi paaTai
yeda pallavinchagaa..aa..ii vELa naalO
chirugaali veechinaa..chiguraaku raalinaa..aa
valapu sangeetamai kadalaaDu naalO..hO..O
oka vENugeetam palikindi paaTai..iiiiii

Friday, February 13, 2015

పూల పల్లకి--1982



సంగీతం::ఇళయరాజ
రచన:::
గానం::S.జానకి 
Film Directed By::Hemambaradharao 
తారాగణం::ప్రతాప్‌పోతన్,అరుణ,నూతన్‌ప్రసాద్,భానుచందర్,శ్రీధర్.

పల్లవి::

ఈ..ఇంటిలో దీపమై హాయిగా 
నా..కంటిలో పాపవై జాలిగా
నా..నీడలో నిదురపోరా
నా..గుండెలో నిలిచి పోరా
ఈ ఇంటిలో దీపమై హాయిగా 
నా..కంటిలో పాపవై జాలిగా

చరణం::1

దగా నిండు రేయిది..దయ ద్రుష్టి లేనిది
విలాసాల కోసమే..ధనం జల్లు వారిది 
విడనే విడదు విషాధాల చీకటి 
విడనే విడదు విషాధాల చీకటి
విలాసాల గాఢ..ఆ..వేధించు బాధ
విలాసాల గాఢ..ఆ..వేధించు బాధ  
భరించాలి...నాయనా

ఈ..ఇంటిలో దీపమై హాయిగా 
నా..కంటిలో పాపవై జాలిగా
నా..నీడలో నిదురపోరా
నా..గుండెలో నిలిచి పోరా

చరణం::2

నా..నన..నన..నన..నా..ఆ
తన నన..నన నన తన నన..తన నన 
తన నన నానా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ప్రపంచాన మోసమే నటించేటి నాలలో 
నిశీధాన శోకమే దహించే క్షణాలలో 
వెలిగే రవియై..విరాజిల్లు పాపవై
వెలిగే రవియై..విరాజిల్లు పాపవై
ప్రమోదాల భావి..ఈ..పండించ గోరి
ప్రమోదాల భావి..ఈ..పండించ గోరి  
జనించావు నాయన

ఈ..ఇంటిలో దీపమై హాయిగా 
నా..కంటిలో పాపవై జాలిగా
నా..నీడలో నిదురపోరా
నా..గుండెలో నిలిచి పోరా
ఈ..ఇంటిలో దీపమై హాయిగా 


Poola Pallaki--1982 
Music::Ilayaraja
Lyrics::?
Singer::S.P.Baalu,S.Janaki
Film Directed By::Hemambaradharao
Cast::Prataap^Potan,Mucherla Aruna,Nootan^Prasaad,Phaanuchandar,Sreedhar.

:::::::::::

ii..inTilO deepamai haayigaa 
naa..kanTilO paapavai jaaligaa
naa..neeDalO nidurapOraa
naa..gunDelO nilichi pOraa
ii inTilO deepamai haayigaa 
naa..kanTilO paapavai jaaligaa

::::1

dagaa ninDu rEyidi..daya drushTi lEnidi
vilaasaala kOsamE..dhanam jallu vaaridi 
viDanE viDadu vishaadhaala cheekaTi 
viDanE viDadu vishaadhaala cheekaTi
vilaasaala gaaDha..aa..vEdhinchu baadha
vilaasaala gaaDha..aa..vEdhinchu baadha  
bharinchaali...naayanaa

ii..inTilO deepamai haayigaa 
naa..kanTilO paapavai jaaligaa
naa..neeDalO nidurapOraa
naa..gunDelO nilichi pOraa

::::2

naa..nana..nana..nana..naa..aa
tana nana..nana nana tana nana..tana nana 
tana nana naanaa aa..aa..aa..aa..aa..aa..aa
prapanchaana mOsamE naTinchETi naalalO 
niSeedhaana SOkamE dahinchE kshaNaalalO 
veligE raviyai..viraajillu paapavai
veligE raviyai..viraajillu paapavai
pramOdaala bhaavi..ii..panDincha gOri
pramOdaala bhaavi..ii..panDincha gOri  
janinchaavu...naayana

ii..inTilO deepamai haayigaa 
naa..kanTilO paapavai jaaligaa
naa..neeDalO nidurapOraa
naa..gunDelO nilichi pOraa
ii..inTilO deepamai haayigaa 

మానాన్న నిర్ధోషి--1970



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు 
రచన::D.Cనారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,S.జానకి 
Film Directed By::K.V.Nandana Rao 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు,విజయలలిత

పల్లవి::

నింగి అంచులు వీడి..నేలపై నడయాడి 
నన్ను వలచిన తారకా..నీకు నే నందింతు ఏ కానుక
ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏ కళంకము లేని..ఏకళలు కోల్పోని 
మనసైన....ఓ చంద్రమా..ఆ..ఆ
నీ నిండు మమతయే ఆ కానుక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నా అంగణమ్ము నీ నందన వనమ్ముగా 
తీర్చి దిద్దిన..పారిజాతమా..ఆ..ఆ
నీ ఋణము తీరిపోనిది సుమా..ప్రియతమా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నీ వలపు తోటలో..ననే గరిక పువ్వునై 
నిలిచితిని...అది నాకు చాలు
నా బ్రతుకు చిలికించు నవ పరిమళాలు 
చిలికించు...నవ పరిమళాలు..ఊఊఊఉ

గీతాంజలి--1989



సంగీతం::ఇళయరాజ
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::నాగార్జున ,Girija Shettar

పల్లవి::

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగి నేల తాకేదెలాగ

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఏల జాలి మాటలు మాసి పోవు ఆశలు
నింగి నేల తాకె వేళ
నీవె నేనై పోయెవేళాయె
నేడు కాదులె రేపు లేదులె
వీడుకోలిదె వీడుకోలిదె

చరణం::1

నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజ శాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగ తీసుకో ఓ నీ ప్రేమ

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా

చరణం::2

కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి
ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజ్‌మహల్ శోభకి
పేద వాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటె బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమె తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటె ఓ నీ ప్రేమ

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి
నింగి నేల తాకె వేళ
నీవె నేనై పోయె క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం

geetaanjali--1989
Music::Ilayaraaja
Lyricist::Veturi Sundararama Murthy
Singers::S.P.Balasubrahmanyam, K.S.Chithra
Artist::Nagarjuna Akkineni, Girija Shettar

::::

o priya priya naa priya priya
ela gaali medalu raalu poola dandalu
needo lokam naado lokam
ningi nela taakedelaaga

o priya priya naa priya priya
o priya priya naa priya priya
ela jaali maatalu maasi povu aasalu
ningi nela taake vela
neeve nenai poyevelaaye
nedu kaadule repu ledule
veedukolide veedukolide

::::1

nippulona kaaladu neetilona naanadu
gaalilaaga maaradu prema satyamu
raachaveeti kannedi rangu rangu swapnamu
pedavaadi kantilo prema raktamu
gaganaalu bhuvanaalu veligedi premato
jananaalu maranaalu pilichedi premato
enni baadhalochchina eduru ledu premaku
raaja saasanaalaki longipovu premalu
sawaaluga teesuko o nee prema

o priya priya naa priya priya
o priya priya naa priya priya

::::2

kaalidaasu geetiki krishna raasaleelaki
pranayamoorti raadhaki prema pallavi
aa anaaru aasaki tajmahal sobhaki
peda vaadi premaki kavu pallaki
nidhi kanna eda minna gelipinchu premane
katha kaadu bratukante balikaani premane
vellipoku nestamaa praanamaina bandhamaa
penchukunna paasame tenchi vellipokumaa
jayinchedi okkate o nee prema

o priya priya naa priya priya
o priya priya naa priya priya
kaalamanna preyasi teerchamandile kasi
ningi nela taake vela
neeve nenai poye kshanaana
ledu saasanam ledu bandhanam
premake jayam premade jayam