Friday, February 13, 2015

గీతాంజలి--1989



సంగీతం::ఇళయరాజ
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::నాగార్జున ,Girija Shettar

పల్లవి::

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగి నేల తాకేదెలాగ

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఏల జాలి మాటలు మాసి పోవు ఆశలు
నింగి నేల తాకె వేళ
నీవె నేనై పోయెవేళాయె
నేడు కాదులె రేపు లేదులె
వీడుకోలిదె వీడుకోలిదె

చరణం::1

నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజ శాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగ తీసుకో ఓ నీ ప్రేమ

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా

చరణం::2

కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి
ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజ్‌మహల్ శోభకి
పేద వాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటె బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమె తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటె ఓ నీ ప్రేమ

ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి
నింగి నేల తాకె వేళ
నీవె నేనై పోయె క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం

geetaanjali--1989
Music::Ilayaraaja
Lyricist::Veturi Sundararama Murthy
Singers::S.P.Balasubrahmanyam, K.S.Chithra
Artist::Nagarjuna Akkineni, Girija Shettar

::::

o priya priya naa priya priya
ela gaali medalu raalu poola dandalu
needo lokam naado lokam
ningi nela taakedelaaga

o priya priya naa priya priya
o priya priya naa priya priya
ela jaali maatalu maasi povu aasalu
ningi nela taake vela
neeve nenai poyevelaaye
nedu kaadule repu ledule
veedukolide veedukolide

::::1

nippulona kaaladu neetilona naanadu
gaalilaaga maaradu prema satyamu
raachaveeti kannedi rangu rangu swapnamu
pedavaadi kantilo prema raktamu
gaganaalu bhuvanaalu veligedi premato
jananaalu maranaalu pilichedi premato
enni baadhalochchina eduru ledu premaku
raaja saasanaalaki longipovu premalu
sawaaluga teesuko o nee prema

o priya priya naa priya priya
o priya priya naa priya priya

::::2

kaalidaasu geetiki krishna raasaleelaki
pranayamoorti raadhaki prema pallavi
aa anaaru aasaki tajmahal sobhaki
peda vaadi premaki kavu pallaki
nidhi kanna eda minna gelipinchu premane
katha kaadu bratukante balikaani premane
vellipoku nestamaa praanamaina bandhamaa
penchukunna paasame tenchi vellipokumaa
jayinchedi okkate o nee prema

o priya priya naa priya priya
o priya priya naa priya priya
kaalamanna preyasi teerchamandile kasi
ningi nela taake vela
neeve nenai poye kshanaana
ledu saasanam ledu bandhanam
premake jayam premade jayam

No comments: