Monday, February 16, 2015

మాయాబజార్--1957


సంగీతం::ఘంటసాల
రచన::పింగళినాగేంద్రరావు 
గానం::ఘంటసాల,సావిత్రి 
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,S.V.రంగారావు,రేలంగి,R.నాగేశ్వరరావు, 
C.S.R.ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి 

పల్లవి::

సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
ఎందెందు వెదకిన లేదు కదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి..ఓహో సుందరి..ఆహా సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా

చరణం::1

దూరం దూరం..ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
ఆ..ఆ..ఆ..ఆ  
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా

అయ్యో..సుందరి..
ఆహా సుందరి..ఓహో సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన..లేదు కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా
సుందరి..ఆహా సుందరి..ఓహో సుందరి

చరణం::2

రేపటి దాకా ఆగాలి..ఆ
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
ఊ..
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేకదా

సుందరి..ఓహో సుందరి..ఆహ సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ వగల నా విరహము హెచ్చేకదా
సుందరి..ఆహా సుందరి..ఓహో సుందరి

చరణం::3

హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
ఊ..ఆ..
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా..
ఆ..ఆ..ఆ ఆ..ఆ..ఆ
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా 
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా

సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా
ఊ..అహ..సుందరి..సుందరి ఓహో సుందరి 
ఒహొ..సుందరి..ఊ..ఒహొ..సుందరి..ఓహో సుందరి

No comments: