సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::D.Cనారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::K.V.Nandana Rao
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు,విజయలలిత
పల్లవి::
నింగి అంచులు వీడి..నేలపై నడయాడి
నన్ను వలచిన తారకా..నీకు నే నందింతు ఏ కానుక
ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏ కళంకము లేని..ఏకళలు కోల్పోని
మనసైన....ఓ చంద్రమా..ఆ..ఆ
నీ నిండు మమతయే ఆ కానుక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నా అంగణమ్ము నీ నందన వనమ్ముగా
తీర్చి దిద్దిన..పారిజాతమా..ఆ..ఆ
నీ ఋణము తీరిపోనిది సుమా..ప్రియతమా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నీ వలపు తోటలో..ననే గరిక పువ్వునై
నిలిచితిని...అది నాకు చాలు
నా బ్రతుకు చిలికించు నవ పరిమళాలు
చిలికించు...నవ పరిమళాలు..ఊఊఊఉ
No comments:
Post a Comment