Tuesday, February 17, 2015

దత్తపుత్రుడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::కోసరజురాఘవయ్య 
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,వెన్నిరాడైనిర్మల,రమాప్రభ,సూర్యకాంతం. 

పల్లవి::


ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే   
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే   
మా చేను బంగారం పండిందిలే 

చరణం::1

ఏలూరు కాల్వకింద పాలంకి వెయ్యంగ
ఏలూరు కాల్వకింద పాలంకి వెయ్యంగ
K.C.కెనాలుకింద కేసరాలు చల్లంగ
K.C.కెనాలుకింద కేసరాలు చల్లంగ
నెలకు మూడు వానలూ నిలబెట్టీ కురవంగ
నెలకు మూడు వానలూ నిలబెట్టీ కురవంగ 
చెయ్యెత్తునా పైరు చెండించి పెరిగింది     
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

చరణం::2

నల్లగొండ బత్తుడుచే నాగళ్ళు చేయించి
నాగళ్ళు...చేయించి
కొండపల్లి కమ్మరిచే కొడవళ్ళు సరిపించి
కొడవళ్ళు....సరిపించి
దూపాటి గిత్తలచే దుక్కులు దున్నించాము
దూపాటి గిత్తలచే దుక్కులు దున్నించాము
మట్టిలో నూనెడు పోసి..పుట్టెడు పండించాము                  
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

చరణం::3

చెమట తీసి రైతు పాటు చెయ్యకపోతే
పాటు...చెయ్యకపోతే
గొమాత గుమ్మపాలు ఇయ్యక పోతే
గుమ్మపాలు...ఇయ్యక పోతే
కుక్కలనే పీక్కుతినే డొక్కల కరువొస్తుందీ
కుక్కలనే పీక్కుతినే డొక్కల కరువొస్తుందీ
తిని తిరెగే సోంబేరుల తిక్క వదిలి పోతుంది         
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

No comments: