Monday, February 16, 2015

మాయాబజార్--1957



















సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::ఘంటసాల,P.లీల 
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,S.V..రంగారావు,రేలంగి,R.నాగేశ్వరరావు, 
C.S.R.ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి 

పల్లవి::

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

తారాచంద్రుల విలాసములతో 
విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో 
విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే 
పిల్ల వాయువుల లాలనలో
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::2

అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో..మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమానౌకలో హాయిగ చేసే విహారణలో

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::3

రసమయ జగమును రాసక్ఱీడకు 
ఉసిగొలిపే ఈ మధురిమలో..మధురిమలో
రసమయ జగమును రాసక్ఱీడకు 
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే 
చల్లని దేవుని అల్లరిలో

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

No comments: