Sunday, October 14, 2012

యముడికి మొగుడు--1988



సంగీతం::రాజ్ కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S. జానకి
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రాధ,కైకాలసత్యనారాయణ,కోటాశ్రీనివాస్‌రావు,అల్లురామలింగయ్య.

పల్లవి::

వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే
లయలే చూసి లాలించుకో

ఓ ఓ ..
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో
జతులాడాలి జత చేరుకో

ఓ ఓ..వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా

చరణం::1

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో
వద్దు లేదు నా భాషలో
మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో
హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే సోకితే కోరికన్నదే రేగదా
వడగట్టేసి బిడియాలనే ఒడిచేరాను వాటేసుకో

మ్మ్..వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా

చరణం::2

అందమంత జల్లుమంటే అడ్డు తాకునా
చీరకట్టు తానాగునా
పాలపుంత ఎల్లువైతే పొంగు దాగునా
జారుపైట తానాగునా
కొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో
ఓ ఓ..వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా
చితచితలాడు ఈ చిందులో
జతులాడాలి జత చేరుకో..ఓ ఓ  

2 comments:

శ్రీ said...

manchi rain song saahityam pettaru...baagundi...@sri

srinath kanna said...

thank you Srii garu