Showing posts with label వేటగాడు--1979. Show all posts
Showing posts with label వేటగాడు--1979. Show all posts

Monday, July 06, 2015

వేటగాడు--1979



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం:S.P.బాలు, P.సుశీల
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,సత్యనారాయణ,జయమాలిని. 

పల్లవి::

పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు
కట్టుకున్నోడు వదిలేసాడు చు చు చు చు
అయ్యో..పుట్టింటోళ్ళు తరిమేసారు 
కట్టుకున్నోడు..వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా..నా సామి 
కట్టుకుంటే..మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా..నా సామి 
కట్టుకుంటే..మూడే ముళ్ళురా

అయ్యోపాపం పాపయమ్మ..టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ..టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే..ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే..ఆ
పట్టు చూస్తే పాతికేళ్ళులే..ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే..ఏఏఏ
పుట్టింటోళ్ళు తరిమేసారు..అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు..టింగురంగా బంగారమ్మ

చరణం::1

హా..గడపదాటిననాడె.కడప చేరాను..చు చు చు చు
తలకపోసిన్నాడే..తలుపు తీసాను..చు చు చు చు
వలపులన్ని కలిపి..వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి..వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను

అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో..అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను 
ముద్దుకైనా ముట్టుకోను

పుట్టింటోళ్ళు తరిమేసారు..అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు..టింగురంగా బంగారమ్మ

చరణం::2

గజ్జెలున్నన్నాళ్ళు..ఘల్లుమంటుంటాను..చు చు చు చు
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను..చు చు చు చు
తోడు దొరికిన్నాడు..గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే..అ..నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే..మొగుడనుకుంటాను

అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం
అహహ..అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ..నాంచారమ్మ

పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు
కట్టుకున్నోడు వదిలేసాడు చు చు చు చు
అయ్యోపాపం పాపయమ్మ..టింగురంగా బంగారమ్మ

Sunday, July 05, 2015

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే

ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు..గువ్వ తడిసే
గుండె మాటు..గుట్టు తడిసే
గూడు చాటు..గువ్వ తడిసే
గుండె మాటు..గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది  

చరణం::1

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ..అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
అహ అహ..అహ అహ

ఓ..చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే 
ఓ..చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే 
ఓ..చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే

నీ..మాట విని మబ్బు మెరిసి..అహ
జడివానలే..కురిసి కురిసి 
వళ్ళు తడిసి..వెల్లి విరిసి
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ..అహ ఆహ  
ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

చరణం::2 

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే 
అహ అహ..అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే 
అహ అహ..అహా అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే

అహ..నీ పాట విని మెరుపులొచ్చి..అహ
నీ విరుపులే..ముడుపు లిచ్చి
చలిని పెంచి..చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ..అహ ఆహ  

ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

వేటగాడు--1979



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::జానకి
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు..నోచని కోట
ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు..నోచని కోట 
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు..నోచని కోట 
పగిలిన నాగుండెలలో..పగిలిన నాగుండెలలో 
రగులుతున్న రాగం..ఈ పాటా..ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు నోచని..కోట..ఆ ఆ ఆ

చరణం::1

పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట ఇది ఒక నాడు 
చిగురించన మోడులకు నిదురించని గుండెలలో 
చితిపేర్చిన వల్లకాడు..ఈ నాడు..ఊ

కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం 
కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం 
ఇక్కడే..ఏ ఏ ఏ ఏ ఏ ఏ..కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం 

శీలానికి కాలం మూడి కాలానికి ఖర్మం కాలీ
న్యాయానికి గాయం తగిలీ గాయంలో గేయం రగిలి
నెత్తురిలో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే

ఇది మాతృహృదయమే మృత్య నిలయమయి 
ఎగసిన విలయ తరంగం..ఊ
మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం 

అందుకే..ఏ ఏ ఏ ఏ 
పలుకుతుంది శ్లోకం నా శోకంమూ..ఊ ఊ
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు నోచని..కోట..ఆ ఆ ఆ

Saturday, July 05, 2014

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ
కొండమీన సందమామా..కొనలోన కోయభామ
కొండమీన సందమామా..కొనలోన కోయభామ
పకపకలాడింది..నా పట్టు తప్పింది
పకపకలాడింది..నా పట్టు తప్పింది
దీని ముక్కుకు తాడెయ్యా
బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు..మొక్కయ్యా
ఈ సక్కని చుక్కే నా సొంతం
కొండమీన సందమామా..కొనలోన కోయ మామ
కొండమీన సందమామా..కొనలోన కోయ మామ
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు
ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య
బలె సక్కిలిగిలిదీనందం
సుక్కలు పక్కేయ్యా..ఈ పక్కిట సిక్కే నా సొంతం 
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయ మామ..ఆ..ఆ

చరణం::1

ఎండల్లో వానలాగే యెంట వస్తాను
కొండల్లో కోన లాగే జంటగుంటాను
ఆ మూడు ముల్లేసి..ఈ ముద్దు చెల్లిస్తా
ఆ మూడు ముల్లేసి..ఈ ముద్దు చెల్లిస్తా

ఐదు ప్రాణాల అందం..ఆరతీస్తాను
ఏడూ జన్మాల బంధం..హారమేస్తానూ
ఐదు ప్రాణాల అందం..ఆరతీస్తాను
ఏడూ జన్మాల బంధం..హారమేస్తానూ

ఈ ముద్దు చెల్లిస్తే..ఆ హద్దు చెరిపేస్తా
ఈ ముద్దు చెల్లిస్తే..ఆ హద్దు చెరిపేస్తా

దీని ముక్కుకు..తాడెయ్య
బలె..సక్కిలిగిలిదీనందం
సుక్కులు..మొక్కయ్యా
ఈ సక్కని చుక్కే..నా సొంతం
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయమామ
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయభామ

చరణం::2

ఏరంటి నిన్ను చూసి..ఎల్లువవుతాను
వరదల్లె పొంగుతుంటే..వంతెనేస్తాను
ఎన్నెట్లో గోదారి..కౌగిట్లో పొంగిస్తా
ఎన్నెట్లో గోదారి..కౌగిట్లో పొంగిస్తా
ఆకాశమయితే నువ్వు..చుక్కనవుతాను
అందాల జాబిలయితే..పక్కనుంటాను
ఆకాశమయితే నువ్వు..చుక్కనవుతాను
అందాల జాబిలయితే..పక్కనుంటాను
మల్లెల్లో ఇల్లేసీ..మనసంతా ఇచ్చేస్తా
మల్లెల్లో ఇల్లేసీ..మనసంతా ఇచ్చేస్తా
దీని ముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు..మొక్కయ్యా..ఈ సక్కని చుక్కే నా సొంతం
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయభామ
పకపకలాడింది..నా పట్టు తప్పింది
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు
ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం
సుక్కలు పక్కేయ్యా..ఈ పక్కిట సిక్కే నా సొంతం
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయభామ
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయమామ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కొయిలాలో..ఓ..ఓ

Friday, July 05, 2013

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

బంగారు బాతు..గుడ్డు
బందారు..తొక్కుడు లడ్డు
బంగారు బాతు..గుడ్డు
బందారు..తొక్కుడు లడ్డు

సయ్యనవే..నా సరసకు రావే
సయ్యనవే..నా సరసకు రావే
చక్కెర తునుక కిక్కురమనక
పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ
నా లడ్డు..ఊ..ఊ..గాడిద గుడ్డు
ఆ..బంగారు..బాతు గుడ్డు
బందారు తొక్కుడు..లడ్డు

చరణం::1

తీగ నడుములో..రాగమున్నది
పాల సొగసులో..మీగడున్నదీ
వయసు వరదలా..పొంగుతున్నదీ
మనసు మరదల అంటూ వున్నది
తుంటరి గుంట..హ్హా..హ్హా..హ్హా వంటరిగుంటే..హ
తుంటరి గుంట వంటరిగుంటే
వంటికిమంచిది కాదీ పొద్దు..లడ్డు..నా లడ్డు
గాడిద గుడ్డు..ముహ్హూ..ఊ

అబ్బాయి వళ్ళు..ఎలా వున్నది
అమ్మాయి వాటం..తెలియకున్నదీ
అబ్బాయి వళ్ళు..ఎలా వున్నది
అమ్మాయి వాటం..తెలియకున్నదీ 
చేయి తగిలినా..చెంప పగిలినా 
తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు..ఓరి జిడ్డూ
గాడిద గుడ్డు..ఉహ్హూ
ఆ..బంగారు బాతు గుడ్డు..షటాప్
బందారు తొక్కుడు లడ్డు..ఛా..పో

చరణం::2 

కస్సు మన్నదీ..గడసు చిన్నదీ
కిస్సు..కిస్సనీ..అడుగుతున్నదీ
పగటి చుక్కలా..వెలుగుతున్నదీ..ఈ
పడుచు దిక్కునా..ఎదుటే వున్నదీ
లకుముకి పిట్ట..త్ప్రూ..హూ..తికమకపెడితే..ఆహా
లకుముకి పిట్ట..తికమకపెడితే
చెకుముకి దెబ్బ తినిపిస్తానే లడ్డు..నా..లడ్డూ
గాడిద గుడ్డు..ముహ్హూ

హల్లో మిస్టర్..అడవిరాముడు..హో..హో..హో..హో
అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు..పోయీ..పోయ్ పపబ్బాయి
హల్లో మిస్టర్ అడవిరాముడు..అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు
తాత తుపాకి పాత గిరాకీ..పిల్ల చలాకీ చూపిస్తాలే
చూడు..ఓరి జిడ్డూ..గాడిద గుడ్డు..ముహ్హూ
బంగారు బాతు గుడ్డు..షటాప్
బందారు తొక్కుడు లడ్డు..ఛా పో
సయ్యనవే..ముహ్హూ
నా సరసకు రావే..వ్వే..వ్వే..వ్వే
సయ్యనవే..నా సరసకు రావే..ఏ
చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే 
చేరుస్తానే ఒడ్డూ..డూ..డూ..డూ
గాడిద గుడ్డు..ముహ్హూ..ఊ

Thursday, July 04, 2013

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

జాబిలితో చెప్పనా..ఆఆఆ
జాబిలితో చెప్పనా..జామురాతిరి నిదురలోన 
నీవు చేసిన అల్లరి చెప్పనా..రోజా

జాబిలితో చెప్పనా..ఆఆఆ
జాబిలితో చెప్పనా..జామురాతిరి కలలలోన 
నీవు రేపిన అలజడి చెప్పనా..రాజా

చరణం::1 

తుమ్మెదలంటని..తేనెలకై
తుంటరి పెదవికి..దాహాలు
చుక్కలు చూడని.చీకటిలో
సిగ్గులు కలవని..విరహాలు
చూపులలో చలి..చురచురలూ 
ఆకలి తీరని..విరవిరలూ  
అన్ని ఆవిరి..పెడుతుంటే
నన్నే అల్లరి..పెడుతున్నావని
చెప్పనా..ఆ..చెప్పనా..ఆ..చెప్పనా 
జాబిలితో చెప్పనా..ఆఆఆ
జామురాతిరి..కలలలోన నీవు 
రేపిన అలజడి చెప్పనా..రాజా

చరణం::2 

గొంతులు దాచిన.గుండెలలో
కోయిల పాడని..గీతాలు
సూర్యుడు చూడనని..గంగలలో
అలలై పొంగిన..అందాలు

కౌగిట కాముని.పున్నములు    
వెన్నెల వీణల..సరిగమలు  
పేరంటానికి..రమ్మంటే
పెళ్ళికి పెద్దవు..నీవేలెమ్మని
చెప్పనా.ఆ..చెప్పనా..ఆ..చెప్పనా
జాబిలితో చెప్పనా..ఆఆఆ
జాబిలితో చెప్పనా..జామురాతిరి కలలలోన 
నీవు రేపిన అలజడి చెప్పనా..రాజా
జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా
జామురాతిరి నిదురలోన నీవు 
చేసిన అల్లరి చెప్పనా..రోజా
రోజా..రాజా..రోజా..రాజా
రోజా..రాజా..రోజా..రాజా