Monday, June 08, 2009

ఇద్దరు అసాధ్యులే--1979




సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::S.P.బాలు,P.సుశీల

Film Director::K. S. R. Das
Starring::Krishna,Rajnikanth,Jayaprada,Geetha,SowcarJanaki.

pallavi::

చినుకు చినుకు పడుతూ వుంటే..తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చినుకు చినుకు పడుతూ వుంటే..తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..ఈ హాయి లేదోయి ఏ జంటకూ
ఆహా..హా..ఆఅ..ఆఅ..
హ హ హాహా..హాహాహా హహహహ

::::1

చేయి నడుము చుట్టేస్తుంటే..
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కంవేయగా
చేయి నడుము చుట్టేస్తుంటే..
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కంవేయగా
ఆఆ..ఆఆ..ఆఆ..
ఊపిరాడలేదని నువ్వు..
ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకూ..
ప్రతిరోజు ఈ రోజు అయ్యేందుకూ

చినుకు చినుకు పడుతూ వుంటే.
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.
ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

:::::2

సొంపులన్ని దాచేమేర ఒంటినంటి వున్నది చీర
తొలగిపోతే రట్టైవ్తుందిరా
సొంపులన్ని దాచేమేర ఒంటినంటి వున్నది చీర
తొలగిపోతే రట్టైవ్తుందిరా
ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
గుట్టునున్న నిను చూస్తుంటే..
కొంటే కోర్కె నా కొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకు..
పగ్గాలు లేవింక జంకేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే..ఆ..హా
తడిసి తడిసి ముద్దవుతుంటే..ఆ..హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ష్..ఆ..హా..
ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ....
ఈ హాయి లేదోయి ఏ జంటకూ...

No comments: