Sunday, July 31, 2011

ధర్మచక్రం--1981

















సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P. సుశీల 
తారాగణం::శోభన్ బాబు, జయప్రద,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,మోహన్ బాబు,రమాప్రభ

పల్లవి::

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో నీ ఒడిలో 
తీయని కౌగిలిలో..ఓఓఓఓఓ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో నీ ఒడిలో 
తీయని కౌగిలిలో..ఓఓఓఓఓ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు

చరణం::1 

నడకే మయూరమాయే
నడుమే వయ్యరమాయే 
మెరుపుగా మారిపోనా 
నీ కళ్లలో కలిసిపోనా

మైకం ఒకింత మైకం
బిడియం రవ్వంత బిడియం
చినుకుగా మారిపోనా 
నీ గుండె పై చేరిపోనా..ఆ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు 

చరణం::2

తడిసే చకోరి సొగసు
పొంగే పదారు వయసు 
నా పెదవి కోరుతోంది 
తొలిముద్దు కోరుతోంది

రానీ ముహూర సమయం 
కలలే ఫలించు తరుణం
వలపే నివాళి చేసి 
నిలువెల్ల అల్లుకోనా..ఆ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు

No comments: