సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,
కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్.
:::::::::
వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే
నీలో గోదారి పొంగే
నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే
వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే
నీలో నా ఈడు పొంగే
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే
చరణం::1
ఆకాశమంతా పందిళ్ళు వేసి
భూలోకమంతా పీటల్లు వేసి
ఆకాశమంతా పందిళ్ళు వేసి
భూలోకమంతా పీటల్లు వేసి
కౌగిళ్ళలోనే నా ఇళ్లు చూసి
నీ కళ్ళతోనే ఆ ముళ్ళు వేసి
త్వరపడి మది త్వరపడి నీ జత చేరితే
ఉరవడి నా చెలి వడిలో చెలరేగితే
నాలో నీలో
తొలి కోరిక చలి తీరక నిను చేరగా
తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో
వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే
నీలో గోదారి పొంగే
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే
చరణం::2
కార్తీక వేళ కన్నుల్లు కలిసే
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే
కార్తీక వేళ కన్నుల్లు కలిసే
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే
నీ చూపులోన సూరీడు మెరిసే
నీ ఈడుతోనే నా ఈడు ఒరిసే
తడి అలజడి చలి ముడివడి నిను కోరితే
ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే
నీవే....నేనై
తొలి జంటగా చలిమంటలే ఎదనంటగా
రగిలెను సెగలకు వగలీ చలిమంటలో
వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే
నీలో నా ఈడు పొంగే
నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే
No comments:
Post a Comment