Showing posts with label పట్టిందల్లా బంగారం--1971. Show all posts
Showing posts with label పట్టిందల్లా బంగారం--1971. Show all posts

Wednesday, May 15, 2013

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::దాశరథి
గానం::L.R.ఈశ్వరి , రమణ
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,సత్యనారాయణ,బేబిశ్రీదేవి. 

పల్లవి::

నువ్వెక్కడవుంటే అక్కడ బంగారం
నే నెక్కడవుంటే - అక్కడ వయ్యారం    
నువ్వూ నేనూ ఒకటైతే సింగారం
నువ్వూ నేనూ ఒకటైతే సింగారం        

చరణం::1

పువ్వులా నవ్వుతూ నిన్ను కవ్వించనా..ఆ ఆ ఆ ఆ
మధువునై మత్తులో నిన్ను మురిపించనా..ఆ ఆ ఆ ఆ 
పువ్వులా నవ్వుతూ నిన్ను కవ్వించనా..ఆ ఆ ఆ ఆ
మధువునై మత్తులో నిన్ను మురిపించనా..ఆ ఆ ఆ ఆ
షోకులన్నీ నీకే..నా సొంపులన్నీ నీకే
హ్హా..షోకులన్నీ నీకే..నా సొంపులన్నీ నీకే
మా మాటవింటే..మాతోవుంటే లోటేమిటి..హ్హా     
నువ్వెక్కడవుంటే..అక్కడ బంగారం..మ్మ్
నే నెక్కడవుంటే..అక్కడ వయ్యారం..మ్మ్   
నువ్వూ నేనూ..ఒకటైతే సింగారం..మ్మ్
నువ్వూ నేనూ..ఒకటైతే సింగారం..మ్మ్        

చరణం::2

ఎవరికీ అందనీ సొగసు నువ్వందుకో..ఓ ఓ ఓ ఓ
ఎవరికీ లొంగని చెలిని దరిచేర్చుకో..ఓ ఓ ఓ ఓ 
ఎవరికీ అందనీ సొగసు నువ్వందుకో..ఓ ఓ ఓ ఓ
ఎవరికీ లొంగని చెలిని దరిచేర్చుకో..ఓ ఓ ఓ ఓ   
చూపులన్నీ నీపై ..మా ఆశలన్నీ నీపై
చూపులన్నీ నీపై..మా ఆశలన్నీ నీపై
నీ పొందుమాకు విందై వుంటే..లోటేమిటి..హ్హా 
నువ్వెక్కడవుంటే..అక్కడ బంగారం..మ్మ్
నే నెక్కడవుంటే..అక్కడ వయ్యారం..మ్మ్    
నువ్వూ నేనూ.ఒకటైతే సింగారం..మ్మ్
నువ్వూ నేనూ..ఒకటైతే సింగారం..మ్మ్

Friday, May 10, 2013

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘటసాల గారు
రచన::దాశరథి
గానం::S.జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,సత్యనారాయణ,బేబిశ్రీదేవి,సాక్షి రంగారావు,G.ఇందిర.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏ  
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏ 
దీవానా ఆయా హై..ఏఏ

చరణం::1

చేతిలో..ఓ..మధువుంది..చెంతనే చెలివుందీ..ఈ 
అనుభవించగలవారికి..అంతులేని సుఖముంది 
సుఖముందీ..ఈ..స్వర్గసుఖముందీ..ఆఆఆ  
ముద్దుల ఈ వేళ..హద్దులు నీకేలా
ముద్దుల ఈ వేళ..హద్దులు నీకేలా 
చక్కని చెలికాడా..పక్కకు రావేలా
చక్కని చెలికాడా..పక్కకు రావేలా 
అందమంతా విందు పొందగా..ఆఆ  
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏఏ 
దీవానా ఆయా హై..ఏఏ 

చరణం::2

తీరని కోరికలు..తీరే సమయమిదీ..ఈ..ఆఆ 
కలియని హృదయాలూ..కలిసే తరుణమిదీ..ఈఈఇ 
కలిసే..ఏఏఏ,,తరుణమిదీ..ఆ ఆ ఆ ఆ ఆ 
ఎందుకు హైరానా..యిది నీ సుల్తానా
ఎందుకు హైరానా..యిది నీ సుల్తానా 
నాలో సొగసంతా..నీకే నజరానా
నాలో సొగసంతా..నీకే నజరానా
వలపులోని నిషా..పొంగగా..ఆఆ    
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై   
దిల్ వాలా ఆయా హై..మత్ వాలా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏఏ
దీవానా..ఆహా..మస్తానా..ఓహో 

Friday, May 03, 2013

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,బేబిశ్రీదేవి. 

పల్లవి::

మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  
మేడలో వున్నా ఏడ నీవున్నా
మేడలో వున్నా ఏడ నీవున్నా 
నీ నీడలేక నిలువలేదు ఈ రోజా..హోయ్             
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  

చరణం::1

ముసిముసి నవ్వులలో ముత్యాలు తెచ్చాను
మిసమిస బుగ్గలలో మీగడలే తెచ్చాను
ముసిముసి నవ్వులలో ముత్యాలు తెచ్చాను
మిసమిస బుగ్గలలో మీగడలే తెచ్చాను
దోచే దొరవని..సమయం కనుగొని
దోచే దొరవని..సమయం కనుగొని 
నీ వెచ్చని కౌగిలికై వేచి వేచి వచ్చాను             
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా 

చరణం::2

కన్నులు కలిసేనా..చెకుముకి రవ్వలు
హద్దులు తరిగితే..ముద్దులు పెరిగితే
కన్నులు కలిసేనా..చెకుముకి రవ్వలు
హద్దులు తరిగితే..ముద్దులు పెరిగితే
ఇద్దరి బ్రతుకులేను ముద్దబంతి పువ్వులు
ఇద్దరి బ్రతుకులేను ముద్దబంతి పువ్వులు                         
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  

చరణం::3

ముద్దుగా పలికితే మోవికే కొత్తరుచి
మత్తుగా నువుచూస్తే మధువుకే కొత్తరుచి
ముద్దుగా పలికితే మోవికే కొత్తరుచి
మత్తుగా నువుచూస్తే మధువుకే కొత్తరుచి
అందమంటే నీదే అందెలంటే నీవే
అందమంటే నీదే అందెలంటే నీవే 
జతగా నువ్వుంటె బ్రతుకుకే కొత్తరుచి..సరికొత్తరుచి

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::శ్రీ శ్రీ
గానం::విజయలక్ష్మి కన్నారావు,P. లీల
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ 

పల్లవి::

అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా
మనకిద్దరికీ పెళ్ళంటా..ఇద్దరికీ పెళ్ళంటా 
అమ్మను నేనంటా నాన్నవు నువ్వంటా..ఊహూ
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా

చరణం::1

అమ్మా నాన్నా ఇద్దరిమల్లే బొమ్మరిల్లొకటి కడదామా
బొమ్మలపెళ్ళి చెద్దామా
సరేగానీ బొమ్మకి బొమ్మకి పెళ్ళైపోతే 
బొమ్మల పిల్లలు పుడతారేమో..పుడితే ఏం?
వాళ్ళకి బువ్వ పెట్టేదెవరూ..మిఠాయిలు కొని పెట్టేదెవరూ
వాళ్ళకి బువ్వ పెట్టేదెవరూ..మిఠాయిలు కొని పెట్టేదెవరూ
మనమే..ఎలా ?
అమ్మా నాన్నా మనకిచ్చేవే దాచి పిల్లలకి పెడదామూ
అమ్మా నాన్నా మనకిచ్చేవే దాచి పిల్లలకి పెడదామూ
బొమ్మరింటినే మేడగ చేసి పిల్లలతో మనముందామూ
అందరమూ..కలిసుందామూ
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా

చరణం::2

ఉన్నది కాస్తా వాళ్ళు తినేస్తే మనకీ ఆకలి వేస్తేనూ
కడుపే కేకలు వేస్తేనూ
ఉన్నది కాస్తా వాళ్ళు తినేస్తే మనకీ ఆకలి వేస్తేనూ
కడుపే కేకలు వేస్తేనూ
పిల్లలు తినగా మిగిలిందంతా మనమే తింటామూ
హాయిగ ఉంటామూ
అమ్మవు నీవంటా..నాన్నను నేనంటా
అమ్మవు నీవంటా..నాన్నను నేనంటా
సరేగానీ మనకనదరికీ నిద్దుర వస్తే బొమ్మరింటిలో చోటేదీ
మనమూ పిల్లలు ఒక మంచాన కలిసే పడుకుంటాము
మనమూ పిల్లలు ఒక మంచాన కలిసే పడుకుంటాము
అమ్మా నాన్నా చేసేదంతా ఇంతేగా వోయ్ పుల్లయ్యా
అమ్మా నాన్నా చేసేదంతా ఇంతేగా వోయ్ పుల్లయ్యా
పిచ్చి పుల్లయ్య..పిచ్చి పుల్లయ్యా  

Thursday, May 02, 2013

పట్టిందల్లా బంగారం--1971



సంగీతం::ఘంటసాల గారు
రచన::జంపన పెద్దిరాజు
గానం::ఘంటసాల,S. జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ 

పల్లవి::

ఏయ్ ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావ్..నీ నవ్వింకా బాగుంటుందీ
అదోలాగ ఐపోతావే..అందకుండా వెళిపోతావే
ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావ్..నీ నవ్వింకా బాగుంటుందీ

చరణం::1

అదృష్టపు దివిటీ నీవూ  అది ఎరుగని చీకటి నేనూ
ఏ బాధా ఎరుగని నీవూ ఎదలో సుదలే ఒలికిస్తావూ
అదృష్టపు దివిటీ నీవూ  అది ఎరుగని చీకటి నేనూ
ఏ బాధా ఎరుగని నీవూ ఎదలో సిదలే ఒలికిస్తావూ
అవి అన్నీ తెలియవు నాకూ అమ్మతోనే చెప్పేస్తానూ  
నాన్నను నే ఒప్పిస్తానూ..నీతో జతగా ఉంటానూ
నువ్వెంతో బాగుంటావూ..నీ వలపింకా బాగుంటుందీ
కలిమి మనకు అడ్డుంటుందీ చెలిమి దరికి రమ్మంటుందీ
కలిమి మనకు అడ్డుంటుందీ చెలిమి దరికి రమ్మంటుందీ
ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావూ..నీ వలపింకా బాగుంటుందీ

చరణం::2

కొండలవిగో చూస్తున్నాయీ..గుండెలొకటి చేస్తున్నాయీ
నా మనసే మందిరమవగా నిన్నే నిలిపి పూజిస్తానూ
కొండలవిగో చూస్తున్నాయీ..గుండెలొకటి చేస్తున్నాయీ
నా మనసే మందిరమవగా నిన్నే నిలిపి పూజిస్తానూ 
పూజలేవో తెలియదునాకూ పూవులన్నీ కోసేస్తానూ 
పెళ్ళిదండ చేసేస్తానూ నీ మెడలోనే వేసేస్తానూ
నువ్వెంతో బాగుంటావూ..నీ వలపింకా బాగుంటుందీ
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఆగు ఆగు..ఏయ్ ఆగు ఆగు