Friday, May 03, 2013

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,బేబిశ్రీదేవి. 

పల్లవి::

మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  
మేడలో వున్నా ఏడ నీవున్నా
మేడలో వున్నా ఏడ నీవున్నా 
నీ నీడలేక నిలువలేదు ఈ రోజా..హోయ్             
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  

చరణం::1

ముసిముసి నవ్వులలో ముత్యాలు తెచ్చాను
మిసమిస బుగ్గలలో మీగడలే తెచ్చాను
ముసిముసి నవ్వులలో ముత్యాలు తెచ్చాను
మిసమిస బుగ్గలలో మీగడలే తెచ్చాను
దోచే దొరవని..సమయం కనుగొని
దోచే దొరవని..సమయం కనుగొని 
నీ వెచ్చని కౌగిలికై వేచి వేచి వచ్చాను             
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా 

చరణం::2

కన్నులు కలిసేనా..చెకుముకి రవ్వలు
హద్దులు తరిగితే..ముద్దులు పెరిగితే
కన్నులు కలిసేనా..చెకుముకి రవ్వలు
హద్దులు తరిగితే..ముద్దులు పెరిగితే
ఇద్దరి బ్రతుకులేను ముద్దబంతి పువ్వులు
ఇద్దరి బ్రతుకులేను ముద్దబంతి పువ్వులు                         
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  

చరణం::3

ముద్దుగా పలికితే మోవికే కొత్తరుచి
మత్తుగా నువుచూస్తే మధువుకే కొత్తరుచి
ముద్దుగా పలికితే మోవికే కొత్తరుచి
మత్తుగా నువుచూస్తే మధువుకే కొత్తరుచి
అందమంటే నీదే అందెలంటే నీవే
అందమంటే నీదే అందెలంటే నీవే 
జతగా నువ్వుంటె బ్రతుకుకే కొత్తరుచి..సరికొత్తరుచి

No comments: