Thursday, May 02, 2013

పట్టిందల్లా బంగారం--1971

సంగీతం::ఘంటసాల గారు
రచన::జంపన పెద్దిరాజు
గానం::ఘంటసాల,S. జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ 

పల్లవి::

ఏయ్ ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావ్..నీ నవ్వింకా బాగుంటుందీ
అదోలాగ ఐపోతావే..అందకుండా వెళిపోతావే
ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావ్..నీ నవ్వింకా బాగుంటుందీ

చరణం::1

అదృష్టపు దివిటీ నీవూ  అది ఎరుగని చీకటి నేనూ
ఏ బాధా ఎరుగని నీవూ ఎదలో సుదలే ఒలికిస్తావూ
అదృష్టపు దివిటీ నీవూ  అది ఎరుగని చీకటి నేనూ
ఏ బాధా ఎరుగని నీవూ ఎదలో సిదలే ఒలికిస్తావూ
అవి అన్నీ తెలియవు నాకూ అమ్మతోనే చెప్పేస్తానూ  
నాన్నను నే ఒప్పిస్తానూ..నీతో జతగా ఉంటానూ
నువ్వెంతో బాగుంటావూ..నీ వలపింకా బాగుంటుందీ
కలిమి మనకు అడ్డుంటుందీ చెలిమి దరికి రమ్మంటుందీ
కలిమి మనకు అడ్డుంటుందీ చెలిమి దరికి రమ్మంటుందీ
ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావూ..నీ వలపింకా బాగుంటుందీ

చరణం::2

కొండలవిగో చూస్తున్నాయీ..గుండెలొకటి చేస్తున్నాయీ
నా మనసే మందిరమవగా నిన్నే నిలిపి పూజిస్తానూ
కొండలవిగో చూస్తున్నాయీ..గుండెలొకటి చేస్తున్నాయీ
నా మనసే మందిరమవగా నిన్నే నిలిపి పూజిస్తానూ 
పూజలేవో తెలియదునాకూ పూవులన్నీ కోసేస్తానూ 
పెళ్ళిదండ చేసేస్తానూ నీ మెడలోనే వేసేస్తానూ
నువ్వెంతో బాగుంటావూ..నీ వలపింకా బాగుంటుందీ
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఆగు ఆగు..ఏయ్ ఆగు ఆగు

No comments: