సంగీతం::ఘంటసాల గారు
రచన::దాశరథి
గానం::L.R.ఈశ్వరి , రమణ
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,సత్యనారాయణ,బేబిశ్రీదేవి.
పల్లవి::
నువ్వెక్కడవుంటే అక్కడ బంగారం
నే నెక్కడవుంటే - అక్కడ వయ్యారం
నువ్వూ నేనూ ఒకటైతే సింగారం
నువ్వూ నేనూ ఒకటైతే సింగారం
చరణం::1
పువ్వులా నవ్వుతూ నిన్ను కవ్వించనా..ఆ ఆ ఆ ఆ
మధువునై మత్తులో నిన్ను మురిపించనా..ఆ ఆ ఆ ఆ
పువ్వులా నవ్వుతూ నిన్ను కవ్వించనా..ఆ ఆ ఆ ఆ
మధువునై మత్తులో నిన్ను మురిపించనా..ఆ ఆ ఆ ఆ
షోకులన్నీ నీకే..నా సొంపులన్నీ నీకే
హ్హా..షోకులన్నీ నీకే..నా సొంపులన్నీ నీకే
మా మాటవింటే..మాతోవుంటే లోటేమిటి..హ్హా
నువ్వెక్కడవుంటే..అక్కడ బంగారం..మ్మ్
నే నెక్కడవుంటే..అక్కడ వయ్యారం..మ్మ్
నువ్వూ నేనూ..ఒకటైతే సింగారం..మ్మ్
నువ్వూ నేనూ..ఒకటైతే సింగారం..మ్మ్
చరణం::2
ఎవరికీ అందనీ సొగసు నువ్వందుకో..ఓ ఓ ఓ ఓ
ఎవరికీ లొంగని చెలిని దరిచేర్చుకో..ఓ ఓ ఓ ఓ
ఎవరికీ అందనీ సొగసు నువ్వందుకో..ఓ ఓ ఓ ఓ
ఎవరికీ లొంగని చెలిని దరిచేర్చుకో..ఓ ఓ ఓ ఓ
చూపులన్నీ నీపై ..మా ఆశలన్నీ నీపై
చూపులన్నీ నీపై..మా ఆశలన్నీ నీపై
నీ పొందుమాకు విందై వుంటే..లోటేమిటి..హ్హా
నువ్వెక్కడవుంటే..అక్కడ బంగారం..మ్మ్
నే నెక్కడవుంటే..అక్కడ వయ్యారం..మ్మ్
నువ్వూ నేనూ.ఒకటైతే సింగారం..మ్మ్
నువ్వూ నేనూ..ఒకటైతే సింగారం..మ్మ్
No comments:
Post a Comment