Friday, May 03, 2013

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::శ్రీ శ్రీ
గానం::విజయలక్ష్మి కన్నారావు,P. లీల
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ 

పల్లవి::

అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా
మనకిద్దరికీ పెళ్ళంటా..ఇద్దరికీ పెళ్ళంటా 
అమ్మను నేనంటా నాన్నవు నువ్వంటా..ఊహూ
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా

చరణం::1

అమ్మా నాన్నా ఇద్దరిమల్లే బొమ్మరిల్లొకటి కడదామా
బొమ్మలపెళ్ళి చెద్దామా
సరేగానీ బొమ్మకి బొమ్మకి పెళ్ళైపోతే 
బొమ్మల పిల్లలు పుడతారేమో..పుడితే ఏం?
వాళ్ళకి బువ్వ పెట్టేదెవరూ..మిఠాయిలు కొని పెట్టేదెవరూ
వాళ్ళకి బువ్వ పెట్టేదెవరూ..మిఠాయిలు కొని పెట్టేదెవరూ
మనమే..ఎలా ?
అమ్మా నాన్నా మనకిచ్చేవే దాచి పిల్లలకి పెడదామూ
అమ్మా నాన్నా మనకిచ్చేవే దాచి పిల్లలకి పెడదామూ
బొమ్మరింటినే మేడగ చేసి పిల్లలతో మనముందామూ
అందరమూ..కలిసుందామూ
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా

చరణం::2

ఉన్నది కాస్తా వాళ్ళు తినేస్తే మనకీ ఆకలి వేస్తేనూ
కడుపే కేకలు వేస్తేనూ
ఉన్నది కాస్తా వాళ్ళు తినేస్తే మనకీ ఆకలి వేస్తేనూ
కడుపే కేకలు వేస్తేనూ
పిల్లలు తినగా మిగిలిందంతా మనమే తింటామూ
హాయిగ ఉంటామూ
అమ్మవు నీవంటా..నాన్నను నేనంటా
అమ్మవు నీవంటా..నాన్నను నేనంటా
సరేగానీ మనకనదరికీ నిద్దుర వస్తే బొమ్మరింటిలో చోటేదీ
మనమూ పిల్లలు ఒక మంచాన కలిసే పడుకుంటాము
మనమూ పిల్లలు ఒక మంచాన కలిసే పడుకుంటాము
అమ్మా నాన్నా చేసేదంతా ఇంతేగా వోయ్ పుల్లయ్యా
అమ్మా నాన్నా చేసేదంతా ఇంతేగా వోయ్ పుల్లయ్యా
పిచ్చి పుల్లయ్య..పిచ్చి పుల్లయ్యా  

No comments: