Wednesday, September 30, 2015

సంఘం--1954



సంగీతం::R.సుదర్శనం
రచన::తోలేటి వెంకటరెడ్డి
Film Directed By::M.V.Raaman
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,వైజయంతిమాల,అంజలిదేవి,V,నాగయ్య,S.V.రంగారావు, S.బాలచందర్, S.V.సహస్రనామం, R.బాలసుబ్రహణ్యం, మద్దాలి కృష్ణమూర్తి, T.V.రమణారెడ్డి, P.D.సంబంధం, ఋష్యేంద్రమణి, హేమలతమ్మారావు, బేబి రాధ, కుమారి పుష్ప, శేషయ్య, రంగూన్ రామారావు, సుబ్రహణ్యం, హన్మంతా చారి.

పల్లవి:: 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
లల్లా లాల్లలా..లల్లా లాల్లలా 
లల్లా లాల్లలా..లల్లా లాల్లలా 
లాలల లాలల..లాలల్లల్లా 
భారత వీరకుమారిని..నేనే
నారీ రతనము..నేనే
భారత నారీ అభ్యుదయానికి 
నాయకురాలిని..నే
భారత వీరకుమారిని..నేనే
నారీ రతనము..నేనే
భారత నారీ అభ్యుదయానికి 
నాయకురాలిని..నేనే

చరణం::1

స్వార్థముతో..కులమత భేదముతో 
సతతము పోరే భరతావనిలో 
శాంతి జ్యోతీ..వెలిగిస్తా 
సతతము పోరే భరతావనిలో 
శాంతి జ్యోతీ..వెలిగిస్తా 
కర్షక సౌఖ్యం 
కర్షక సౌఖ్యం..కార్మిక శ్రేయం
కర్షక సౌఖ్యం..కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆ..ఆ
కలిగే మార్గం..చూపిస్తా 

చరణం::2

రాణీ రుద్రమ..మల్లమదేవీ 
రెడ్డినాగమ్మ..నేనే
రాణీ రుద్రమ..మల్లమదేవీ  
రెడ్డినాగమ్మ..నేనే
రణ తిక్కన భార్యా..సతి మాంచాల
తిక్కన భార్యా..సతి మాంచాల
శౌర్య ధైర్యములు..నావే
శౌర్య ధైర్యములు..నావే 

భారత వీరకుమారిని..నేనే 
నారీ రతనము..నేనే
భారత నారీ అభ్యుదయానికి 
నాయకురాలిని..నేనే
ఆహో..ఓఓఓ..ఆఅహో..ఆ..ఆ..ఆ..ఆ
ఆహో..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

సర్దార్ పాపారాయుడు--1980



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావు  
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::DasariNarayanaRao
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,శారద,రావుగోపాల్రావు,మోహన్‌బాబు,కైకాల సత్యనారాయణ,గుమ్మడి,ప్రభాకర్‌రెడ్డి,పండరీబాయి,అల్లురామలింగయ్య,జ్యోతిలక్ష్మీ. 

పల్లవి::

వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్
వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్

ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది
ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది

ఏ దేవి తంత్రమో..శ్రీదేవి..మంత్రమో  
ఏ దేవి తంత్రమో..శ్రీదేవి..మంత్రమో
తెలియాలి..ఆ గుట్టు..ఈ దేవికి
ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది
ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది

ఏ దేవుడి తంత్రమో..ఈ రాముని మంత్రమో 
ఏ దేవుడి తంత్రమో..ఈ రాముని మంత్రమో
తెలియాలి..ఆ..గుట్టు రాముడికి 

చరణం::1

వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్
వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్

అడుగు తీసి అడుగెయ్యనా..నీ అడుగులోన అడుగెయ్యనా
అడుగు తీసి అడుగెయ్యనా..నీ అడుగులోన అడుగెయ్యనా
నే అనుకున్నది అడిగెయ్యనా..అడగకుండా వదిలెయ్యనా
చల్లకొచ్చి ముంతదాచి..పండు తెచ్చి దాచిపెట్టి  
వాటెయ్యకు వదిలెయ్యకు..చెప్పకుండ చంపేయ్యకు 
అనుకున్నది చెప్పకుండ..చంపెయ్యకు  
ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది

చరణం::2

వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్
వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్..వోయ్

గుండెలోన ఇల్లేయ్యనా..ఆ ఇంటిలోన నిన్నుంచనా
గుండెలోన ఇల్లేయ్యనా..ఆ ఇంటిలోన నిన్నుంచనా
అర్ధరాత్రి వచ్చేయ్యనా..మనసైనది చెప్పేయ్యనా

చెప్పకుండా చెయ్యకుండా..రాకుండా ఉండకుండా 
ఊరించకూ ఉడికించకూ..దాచేసి మాటాడకు 
అనుకున్నది..దాచేసి మాటాడకు 
ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది
ఏ దేవి తంత్రమో..శ్రీదేవి మంత్రమో
ఏ దేవుడి తంత్రమో..ఈ రాముని మంత్రమో
తెలియాలి..ఆ గుట్టు..ఈ దేవికి  
ఉయ్యాలకు వయసొచ్చింది..ఊపి ఊపి చంపేస్తుంది

Sardaar PaapaaraayuDu--1980
Music::Chakravarti
Lyrics::DaasariNaaraayaNaRaO  
Singer::SP.Baalu,P.Suseela
Film Directed By::DasariNarayanaRao
Cast::N.T.RaamaaRaou,Sreedevi,Saarada,RaavuGOpaalRao,MOhanBaabu,Kaikaala SatyanaaraayaNa,GummaDi,Prabhaakar^Reddy,Pandareebaayi,Alluraamalingayya.

:::::::

vOy..vOy..vOy..vOy..vOy..vOy
vOy..vOy..vOy..vOy..vOy..vOy

uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi
uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi

E dEvi tantramO..SreedEvi..mantramO  
E dEvi tantramO..SreedEvi..mantramO
teliyaali..aa guTTu..ee dEviki

uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi
uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi

E dEvuDi tantramO..ee raamuni mantramO 
E dEvuDi tantramO..ee raamuni mantramO
teliyaali..aa..guTTu raamuDiki 

::::1

vOy..vOy..vOy..vOy..vOy..vOy
vOy..vOy..vOy..vOy..vOy..vOy

aDugu teesi aDugeyyanaa..nee aDugulOna aDugeyyanaa
aDugu teesi aDugeyyanaa..nee aDugulOna aDugeyyanaa
nE anukunnadi aDigeyyanaa..aDagakunDaa vadileyyanaa
challakochchi muntadaachi..panDu techchi daachipeTTi  
vaaTeyyaku vadileyyaku..cheppakunDa champEyyaku 
anukunnadi cheppakunDa..champeyyaku  
uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi

::::2

vOy..vOy..vOy..vOy..vOy..vOy
vOy..vOy..vOy..vOy..vOy..vOy

gunDelOna illEyyanaa..aa inTilOna ninnunchanaa
gunDelOna illEyyanaa..aa inTilOna ninnunchanaa
ardharaatri vachchEyyanaa..manasainadi cheppEyyanaa

cheppakunDaa cheyyakunDaa..raakunDaa unDakunDaa 
oorinchakoo uDikinchakoo..daachEsi maaTaaDaku 
anukunnadi..daachEsi maaTaaDaku 
uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi
E dEvi tantramO..SreedEvi mantramO
E dEvuDi tantramO..ee raamuni mantramO
teliyaali..aa guTTu..ee dEviki  
uyyaalaku vayasochchindi..oopi oopi champEstundi

సర్దార్ పాపారాయుడు--1980



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావు  
గానం::S.జానకి
Film Directed By::DasariNarayanaRao
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,శారద,రావుగోపాల్రావు,మోహన్‌బాబు,కైకాల సత్యనారాయణ,గుమ్మడి,ప్రభాకర్‌రెడ్డి,పండరీబాయి,అల్లురామలింగయ్య, జ్యోతిలక్ష్మీ.

పల్లవి::

నమస్కారమండి..ఆయ్..అవునండి
అయ్యబాబోయ్..ఆ..ఈలలెందుకండి..వచ్చేశానుగా
మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి
వాయించరా సచ్చినోడా ఊపు కావాలి
ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ ఓటేల్ కెళ్ళానండి
రూము కావాలి అన్నాను 
డబలా? సింగలా? అన్నాడు..డబలే అన్నాను
ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు..ఏ.సి.యే అన్నాను
పేరు అన్నాడు..జ్యోతిలక్ష్మి..అన్నాను

అనగానే గబుక్కున చూశాడు..గుట్టుక్కున నవ్వాడు 
గబుక్కున చూశాడు..గుట్టుక్కున నవ్వాడు 
అతుక్కున లేచాడు..పుటుక్కున విరిచాడు
అతుక్కున లేచాడు..పుటుక్కున విరిచాడు 

గుర్కా రామ్ సింగ్..ఆపరేటర్ అజిత్సింగ్
కిళ్ళీకొట్టు కిషన్ సింగ్..పేపర్ స్టాల్ ధారాసింగ్
ఒగుర్చుకుంటూ వచ్చారు..ఆయాసంతో అరిచారు
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు
ఏమని అరిచారో తెలుసా  

జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది 
జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది 
అయ్యో..బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది 
బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది 

అని చెప్పి గోల గోల చేసి 
చివరికి రూము నెంబరు నూట పదకొండు ఇచ్చాడు
తీరా తలుపు తెరిచి చూస్తే  

చరణం::1

మంచం పక్కన పగిలిన..గాజు ముక్కలు
మంచం క్రింద నలిగిన..మల్లెమొగ్గలు
మంచం మీద మిగిలిన..ఆకువక్కలు
మంచం మీద చాటున వొలికిన పాల చుక్కలు..పాల చుక్కలు 
కంగారు పడి ఏమిటా..అని అడిగాను

ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు 
మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు 
ఆ నిద్దర్లు నాకెప్పుడా అని 
ఆ మంచం మీదే పడుకున్నాను 
పడుకోగానే 

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..మని ఫోన్
డర్ డర్ డర్..మని బెల్లు
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..మని ఫోన్డ
ర్ డర్ డర్..మని బెల్లు

ధన్ ధన్ ధన్ మని తలుపు
ధన్ ధన్ ధన్ మని తలుపు
రా రా రా రమ్మని పిలుపు
రా రా రా రమ్మని పిలుపు
ఏమిటా అని తలుపు తీశాను 
తియ్యగానే...

ఫస్టుఫ్లోరు పాపయ్య..రెండో ఫ్లోరు రంగయ్య
ఆయ్..మూడోఫ్లోరు ముత్తయ్య..లిఫ్ట్ బాయ్ లింగయ్య
ఒగుర్చుకుంటూ వచ్చారు..ఆయాసంతో అరిచారు
ఒగుర్చుకుంటూ వచ్చారు..ఆయాసంతో అరిచారు
ఏమని?

జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది
జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో..బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది
బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది

చరణం::2

ఆ తరువాత ఎలాగూ..మా ఇంటికి వెళ్ళిపోయాను
తీరా ఇంటికి..వెళితే 
గుమ్మానికి మామిడి తోరణాలు 
ఇళ్ళంతా మనుషుల..తిరనాళ్ళు
గదిలో కొత్తవి ఆభరణాలు..గదిలో కొత్తవి ఆభరణాలు
చూసి చూడని..నవ్వుల బాణాలు

కంగారు పడిపోయి అండి
ఏమిటా అని అడిగాను 
ఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి 
పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు
అతను చూస్తాడు త్వరగా రమ్మని
నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు
కూర్చో..గానే
పెళ్ళికొడుకు తమ్ముడు...తమ్ముడుగారి తండ్రి
హెయ్..తండ్రిగారి తాత..ఆ..తాతగారి మనవడు
అరుచుకుంటూ లేచారు..విరుచుకుంటూ అరిచారు
అరుచుకుంటూ లేచారు..విరుచుకుంటూ అరిచారు
ఏమనో తెలుసా?

జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో..జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో..బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది
బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది

అని..కోపంగా ఎళ్ళిపోయారు
ఆ..అందరి కోసం అలా ఉండమంటారా 
ఇలా చీరకట్టుకోమంటారా???

Sardaar PaapaaraayuDu--1980
Music::Chakravarti
Lyrics::DaasariNaaraayaNaRaO  
Singer::S.Jaanaki
Film Directed By::DasariNarayanaRao
Cast::N.T.RaamaaRaou,Sreedevi,Saarada,RaavuGOpaalRao,MOhanBaabu,Kaikaala SatyanaaraayaNa,GummaDi,Prabhaakar^Reddy,Pandareebaayi,Alluraamalingayya.

:::::::

namaskaaram anDi..aay..avunanDi
ayyabaabOy..aa..eelalendukanDi..vachchESaanugaa
monnee madhya maa baavagaarabbaayi peLLiki bejavaaDa ellaananDi
vaayincharaa sachchinODaa oopu kaavaali
illanTE iruggaa unTaanani manOrama OTEl keLLaananDi
roomu kaavaali annaanu 
Dabalaa? singalaa? annaaDu..DabalE annaanu
Esiyaa? naan Esiyaa? annaaDu..E.si.yE annaanu
pEru annaaDu..jyOtilakshmi..annaanu

anagaanE gabukkuna chooSaaDu..guTTukkuna navvaaDu 
gabukkuna chooSaaDu..guTTukkuna navvaaDu 
atukkuna lEchaaDu..puTukkuna virichaaDu
atukkuna lEchaaDu..puTukkuna virichaaDu 

gurkaa raam sing..aaparETar ajitsing
kiLLeekoTTu kishan sing..pEpar sTaal dhaaraasing
ogurchukunToo vachchaaru..aayaasamtO arichaaru
ogurchukunToo vachchaaru.. aayaasamtO arichaaru
Emani arichaarO telusaa  

jyOtilakshmi cheerakaTTindi..paapam cheerakE siggEsindi 
jyOtilakshmi cheerakaTTindi..paapam cheerakE siggEsindi 
ayyO..boTTukE bhayamEsindi..oorantaa hOrettindi 
boTTukE bhayamEsindi..oorantaa hOrettindi 

ani cheppi gOla gOla chEsi 
chivariki roomu nembaru nooTa padakonDu ichchaaDu
teeraa talupu terichi choostE  

::::1

mancham pakkana pagilina..gaaju mukkalu
mancham krinda naligina..mallemoggalu
mancham meeda migilina..aakuvakkalu
mancham meeda chaaTuna volikina 
paala chukkalu..paala chukkalu 
kangaaru paDi EmiTaa..ani aDigaanu

evarO kottagaa peLLi chEsukunna dampatulu 
mooDu niddarlu chEsi veLLaarannaaru 
aa niddarlu naakeppuDaa ani 
aa mancham meedE paDukunnaanu 
paDukOgaanE 

Tring Tring Tring..mani phOn
Dar Dar Dar..mani bellu
Tring Tring Tring..mani phOnDa
Dar Dar Dar..mani bellu

dhan dhan dhan mani talupu
dhan dhan dhan mani talupu
raa raa raa rammani pilupu
raa raa raa rammani pilupu
EmiTaa ani talupu teeSaanu 
tiyyagaanE!!!!

phasTuphlOru paapayya..renDO phlOru rangayya
aay..mooDOphlOru muttayya..liphT baay lingayya
ogurchukunToo vachchaaru..aayaasantO arichaaru
ogurchukunToo vachchaaru..aayaasantO arichaaru
Emani?

jyOtilakshmi cheerakaTTindi..paapam cheerakE siggEsindi
jyOtilakshmi cheerakaTTindi..paapam cheerakE siggEsindi
ayyO..boTTukE bhayamEsindi..oorantaa hOrettindi
boTTukE bhayamEsindi..oorantaa hOrettindi

::::2

aa taruvaata elaagoo..maa inTiki veLLipOyaanu
teeraa inTiki..veLitE 
gummaaniki maamiDi tOraNaalu 
iLLantaa manushula..tiranaaLLu
gadilO kottavi aabharaNaalu
gadilO kottavi aabharaNaalu
choosi chooDani..navvula baaNaalu

kangaaru paDipOyi anDi
EmiTaa ani aDigaanu 
evarO nannu peLLi chEsukOvaDaaniki 
peLLi choopulaku ochchaanannaaru
atanu choostaaDu tvaragaa rammani
nannu mustaabu chEsi koorchObeTTaaru
koorchO..gaanE
peLLikoDuku tammuDu...tammuDugaari tanDri
hey..tanDrigaari taata..aa..taatagaari manavaDu
aruchukunToo lEchaaru..viruchukunToo arichaaru
aruchukunToo lEchaaru..viruchukunToo arichaaru
EmanO telusaa?

jyOtilakshmi cheerakaTTindi..paapam cheerakE siggEsindi
ayyO..jyOtilakshmi cheerakaTTindi..paapamcheerakE siggEsindi
ayyO..boTTukE bhayamEsindi..oorantaa hOrettindi
boTTukE bhayamEsindi..oorantaa hOrettindi

ani..kOpangaa eLLipOyaaru
aa..andari kOsam alaa unDamanTaaraa 
ilaa cheerakaTTukOmanTaaraa???

Tuesday, September 29, 2015

శ్రీ గౌరీ మహత్యం--1956


సంగీతం::ఓగిరాల రామచంద్రరావు / టి.వి.రాజు
రచన::మల్లాది
గానం::లీల 

పల్లవి::

అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
చూపే ఠీవీ చూసే చూపు 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా అమ్మా 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా

చరణం::1

అమ్మా నీవు అంగజ వైరీ..ఈఈఈఈ
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి 
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి
లీలగ మేలుగా లోకాలన్నీ 
లీలగ మేలుగా లోకాలన్నీ
ఏలే..ఆ..చిద్విలాసం

చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా అమ్మా
చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా

చరణం::2

అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన 
అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన
మేనులొకటై ఆదమరచి 
మేనులొకటై ఆదమరచి 
వేడుకగా చేసే నాట్యం 

చూడాలమ్మా కనుపండువుగా

Monday, September 28, 2015

ఎగిరే పావురమా--1997



సంగీతం::S.V.కృష్ణారెడ్డి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
Film Directed By::S.V.Krishna Reddy 
గానం::సునీత
తారాగణం::శ్రీకాంత్,లైలా,J.D.చక్రవర్తి,సుహాసిని 

పల్లవి::

మాఘమాసం ఎప్పుడొస్తుందో..మౌనరాగాలెన్నినాళ్లో
మంచు మబ్బుకమ్ముస్తుందో..మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా..వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు..చిన్నోడోయమ్మా..ఆఆఆ  

మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్నినాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా..వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు..చిన్నోడోయమ్మా..ఆఆఆ 

చరణం::1

తీపి చెమ్మల తేనె చెక్కిలి..కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని..ముసిరాడే నాతోడు
నా కౌగిలింతల కానుకేదని..అడిగాడే ఆనాడు
లేత లేతగా సొంతమైనవి..దోచాడే ఈనాడు
ఓయమ్మా...ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు...నా సిగ్గు దోచేస్తే

మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్నినాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా..వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు..చిన్నోడోయమ్మా..ఆఆఆఆ  

చరణం::2

తేనె మురళికి తీపి గుసగుస..విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి..చిలికాడే చినవోడు
నా కంటి పాపకు కొంటె కలలను..అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ..పలికించేదేనాడో
ఓయమ్మో...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే..శభలగ్నమేనాడో

మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా..వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు..చిన్నోడోయమ్మా..ఆఆఆఆ 

Egire Paavuramaa--1997  
Music::S.V.KrishnaReddi
Lyrics::Veetuuri 
Singer::Suneeta
Film Directed By::S.V.Krishna Reddy 
Cast::Srikanth, Suhasini Maniratnam, J D Chakravarthy, Laila Mehdin, Nirmalamma, Kota Srinivasa Rao, Brahmanandam, Babu Mohan, Tanikella Bharani, Charan Raj, Gundu Hanumanta Rao, Srilakshmi, Jhansi

:::::::::

maaghamaasam eppuDostundO..maunaraagaalenninaaLlO
manchu mabbukammustundO..mattu mattu enniyallO
evaranTE eTTammaa..vivaraalE guTTammaa
chikubuku chiku..chinnODOyammaa..aaaaaaaa  

maaghamaasam eppuDostundO..maunaraagaalenninaaLlO
evaranTE eTTammaa..vivaraalE guTTammaa
chikubuku chiku..chinnODOyammaa..aaaaaaaa 

::::1

teepi chemmala tEne chekkili..kosaraaDE naavODu
mukku pachchalu aaralEdani..musiraaDE naatODu
naa kaugilintala kaanukEdani..aDigaaDE aanaaDu
lEta lEtagaa sontamainavi..dOchaaDE eenaaDu
Oyammaa...aa aa aa aa aa aa
haayammaa valapulE tolirEyammaa vaaTEstE
chinavaaDu...naa siggu dOchEstE

maaghamaasam eppuDostundO..maunaraagaalenninaaLlO
evaranTE eTTammaa..vivaraalE guTTammaa
chikubuku chiku..chinnODOyammaa..aaaaaaaa  

::::2

tEne muraLiki teepi gusagusa..visiraaDE pilagaaDu
raati manasuna prEma alajaDi..chilikaaDE chinavODu
naa kanTi paapaku konTe kalalanu..alikaaDE atagaaDu
vanTi batukuna janTa sarigama..palikinchEdEnaaDO
OyammO...aa aa aa aa aa aa aa aa aa
oLLantaa manasulE ee tuLLinta telusulE
peLLaaDE..SabhalagnamEnaaDO

maaghamaasam eppuDostundO..maunaraagaalenninaaLlO
evaranTE eTTammaa..vivaraalE guTTammaa
chikubuku chiku..chinnODOyammaa..aaaaaaaa 

ఎగిరే పావురమా--1997



సంగీతం::S.V.కృష్ణారెడ్డి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
Film Directed By::S.V.Krishna Reddy 
గానం::S.P.బాలు
తారాగణం::శ్రీకాంత్,లైలా,జె.డి.చక్రవర్తి,సుహాసిని .

పల్లవి::

గుండె గూటికి పండుగొచ్చింది 
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ..ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం..పెడుతుందీ..ఈఈఈఈ  

గుండె గూటికి..పండుగొచ్చింది
పండు వెన్నెల..పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ..ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం...పెడుతుందీ..ఈఈఈఇ 

చరణం::1

నేలనోదిలిన గాలి పరుగున..ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను..వేగంగా చేయాలి
నా ఇంటి గడపకి మింటి మెరుపుల..తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి..స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో..ఓఓఓఓఓ..ఎన్నెన్నో చేసినా 
ఇంతేనా...అనిపిస్తుంది
ఏ పని తోచక..తికమక పెడుతుంది
గుండె గూటికి..పండుగొచ్చింది 
పండు వెన్నెల..పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ..ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం..పెడుతుందీ..ఈఈఈఈఈఈ

చరణం::2

బావ మమతల..భావ కవితలే
శుభ లేఖలు...కావలి
బ్రహ్మ కలిపినా..జన్మ ముడులకు
సుముహుర్తం..రావాలి
మా..ఆ..ఏడు అడుగుల జోడు నడకలు..ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని..అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు....ఓఓఓఓఓఓఓఓ..ఇన్నాళ్ళు ఎదురు చూసే 
నా ఆశల...రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే..కళకళ కనపడగ
గుండె గూటికి..పండుగొచ్చింది
పండు వెన్నెల..పంచుతుందీ..ఈ
మబ్బుల్లో జాబిల్లీ..ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం..పెడుతుందీ..ఈఈఈఈ 

Egire Paavuramaa--1997  
Music::S.V.KrishnaReddi
Lyrics::Veetuuri 
Singer::S.P.Baalu
Cast::Srikanth, Suhasini Maniratnam, J D Chakravarthy, Laila Mehdin, Nirmalamma, Kota Srinivasa Rao, Brahmanandam, Babu Mohan, Tanikella Bharani, Charan Raj, Gundu Hanumanta Rao, Srilakshmi, Jhansi

:::::::::

gunDe gooTiki panDugochchindi 
panDu vennela panchutundee
mabbullO jaabillee..mungiTlO digutundee
naa inTlO deepam..peDutundee..iiiiiii  

gunDe gooTiki panDugochchindi 
panDu vennela panchutundee
mabbullO jaabillee..mungiTlO digutundee
naa inTlO deepam..peDutundee..iiiiiiii 

::::1

nEla nOdilina gaali paruguna..oorantaa chuTTaali
vELa teliyaka vEla panulanu..vEgangaa chEyaali
naa inTi gaDapaki minTi merupula..tOraNamE kaTTaali
konTe kalalatO janTa chilakaki..swaagatamE cheppaali
ennennO..OOOOO..ennennO chEsinaa 
intEnaa...anipistundi
E pani tOchaka..tikamaka peDutuNdi

gunDe gooTiki panDugochchindi 
panDu vennela panchutundee
mabbullO jaabillee..mungiTlO digutundee
naa inTlO deepam..peDutundee..iiiiiiii 

::::2

baava mamatala..bhaava kavitalE
Subha lEkhalu...kaavali
brahma kalipinaa..janma muDulaku
sumuhurtam..raavaali
maa..aa..EDu aDugula jODu naDakalu..oorantaa chooDaali
vElu viDuvani tODu immani..akshintalu vEyaali
innaaLLu....OOOOOOOO..innaaLLu eduru choosE 
naa aaSala...raajyamlO
raaNini teesuku vachchE..kaLakaLa kanapaDaga

gunDe gooTiki panDugochchindi 
panDu vennela panchutundee
mabbullO jaabillee..mungiTlO digutundee
naa inTlO deepam..peDutundee..iiiiiiii  

Saturday, September 26, 2015

శుభ సంకల్పం----1995



సంగీతం::M.M.కీరవాణి
రచన::P.C.శ్రీరాం 
గానం::S.P.బాలు,S.P.శైలజ 
Film Directed By::Kasinadhuni Viswanath 
తారాగణం::K.విశ్వనాథ్,కమల్‌హాసన్,ఆమని,ప్రియరామన్.

పల్లవి::

ఆ ఆఅ ఆ ఆఅ ఆహ్హాహ్హహ్హాహా..ఆ ఆ ఆఅ
ఆహాహా ఆహా హా ఆ ఆ ఆ ఆ హ్హా ఆఆఆ

మూడుముళ్ళు వేసినాక చాటులేదు మాటులేదు
గుట్టు బైట పెట్టమాక..ఆ హా ఆహ్హా హా

ఏడు అంగలేసినాక..ఎన్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాతా హ హ హ హ హ 

ఆకుపచ్చ కొండల్లో..ఓఓఓఓ
గోరువెచ్చ..గుండెల్లో 
ఆకుపచ్చ కొండల్లో..గోరువెచ్చ గుండెల్లో 
ముక్కు పచ్చలారబెట్టి ముద్దులంటా 
ఆహ హ హా హ హ హ..అ
మూడుముళ్ళు వేసినాక చాటులేదు మాటులేదు
గుట్టు బైట పెట్టమాక..ఆ హా ఆహ్హా హా

ఏడు అంగలేసినాక..ఎన్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాతా హ హ హ హ హ

చరణం::1

హ హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ..
హ హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ..
హోయ్..పుష్య మాసమొచ్చింది..భోగి మంటలేసింది 
కొత్త వేడి పుట్టింది..గుండెలోనా..హ హ హ 
రేగు మంట పూలకే..రెచ్చిపోకు తుమ్మెద 
కాచుకున్న ఈడునే..దోచుకుంటే తుమ్మెద 
హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్..
మంచు దేవతొచ్చిందా..మంచమెక్కి కూకుందా 
అహహ అహహ అహహ అహహ
వణుకులమ్మ తిరణాల్లే..ఓరి నాయనో  
సీతమ్మోరి సిటికిన ఏలు సిలక తొడిగితే సిగ్గులెర్రనా 
రాములోరు ఆ సిలక కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రనా 

మూడుముళ్ళు వేసినాక చాటులేదు మాటులేదు
గుట్టు బైట పెట్టమాక..ఆ హా ఆహ్హా హా

ఏడు అంగలేసినాక..ఎన్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాతా హ హ హ హ హ

చరణం::2

హాయి దాయి దాయి దాయి హాయి
హాయి దాయి దాయి దాయి హాయి
వయసు చేదు తెలిసింది..మనసు పులుపు కోరింది 
చింత చెట్టు వెతికింది..చీకటింట..
హ హ హ హ హ 

కొత్త కోరికేమిటో..చెప్పుకోవే కోయిల 
ఉత్తమాటలెందుకు..తెచ్చుకోర ఊయల 
హా హా హోయ్ హోయ్ హోయ్
ముద్దువాన వెలిసింది..పొద్దుపొడుపు తెలిసింది 
వయసు వరస మారింది..ఓరి మన్మధా..ఆ 
మూడు ముళ్ళ జతలోన..ముగ్గురైన ఇంటిలోనా 
జోరు కాస్త తగ్గనీర జో జో జో
జోజో జోజో జోజోజో
జోజో జోజో జోజోజో

Subha Sankalpam--1995
Music::M.M.Keeravaani
Lyrics::P.C.SreeRam
Singer::S.P.Baalu,S.P.Sailaja 
Film Directed by::Kasinadhuni Viswanath
Cast::K.Vswanaath,Kamalhasan,Amani,PriyaRaman..  

:::::::::

aa aaa aa aaa aahhaahhahhaahaa..aa aa aaa
aahaahaa aahaa haa aa aa aa aa hhaa aaaaaa

mooDumuLLu vEsinaaka chaaTulEdu maaTulEdu
guTTu baiTa peTTamaaka..aa haa aahhaa haa

eeDu angalEsinaaka..ennelinTa kaalupeTTi
paaDukunTa enkipaataa ha ha ha ha ha 

aakupachcha konDallO..OOOO
gOruvechcha..gunDellO 
aakupachcha konDallO
gOruvechcha gunDellO 
mukku pachchalaarabeTTi muddulanTaa 
aaha ha haa ha ha ha..a
mooDumuLLu vEsinaaka chaaTulEdu maaTulEdu
guTTu baiTa peTTamaaka..aa haa aahhaa haa

aeDu angalEsinaaka..ennelinTa kaalupeTTi
paaDukunTa enkipaataa ha ha ha ha ha

::::1

ha ha ha ha ha O O O O O..
ha ha ha ha ha O O O O O..
hOy^..pushya maasamochchindi..bhOgi manTalEsindi 
kotta vEDi puTTindi..gunDelOnaa..ha ha ha 
rEgu manTa poolakE..rechchipOku tummeda 
kaachukunna eeDunE..dOchukunTE tummeda 
hOy^ hOy^ hOy^ hOy^ hOy^..
manchu dEvatochchindaa..manchamekki kookundaa 
ahaha ahaha ahaha ahaha
vaNukulamma tiraNaallE..Ori naayanO  
seetammOri siTikina Elu silaka toDigitE siggulerranaa 
raamulOru aa silaka korikitE seetammOri buggalerranaa 

mooDumuLLu vEsinaaka chaaTulEdu maaTulEdu
guTTu baiTa peTTamaaka..aa haa aahhaa haa

EDu angalEsinaaka..ennelinTa kaalupeTTi
paaDukunTa enkipaataa ha ha ha ha ha

::::2

haayi daayi daayi daayi haayi
haayi daayi daayi daayi haayi
vayasu chaedu telisiMdi..manasu pulupu kOriMdi 
chinta cheTTu vetikindi..cheekaTinTa..
ha ha ha ha ha 

kotta kOrikEmiTO..cheppukOvE kOyila 
uttamaaTalenduku..techchukOra ooyala 
haa haa hOy hOy hOy
mudduvaana velisindi..poddupoDupu telisindi 
vayasu varasa maarindi..Ori manmadhaa..aa 
mooDu muLLa jatalOna..mugguraina inTilOnaa 
jOru kaasta tagganeera jO jO jO
jOjO jOjO jOjOjO
jOjO jOjO jOjOjO

పెళ్లి--1997



సంగీతం::S.A.రాజ్ కుమార్
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు 
Film Directed by::Kodi Ramakrishna 
తారాగణం::వడ్డె నవీన్,మహేశ్వరి,పృథ్విరాజ్.  

పల్లవి::

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
యవ్వన వీణ..పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన 
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు..ప్రేమ ఔనా
ఇవాళే నిన్ను..పోల్చుకున్నా
నీ పేరు..ప్రేమ ఔనా
ఇవాళే..నిన్ను పోల్చుకున్నా
ఓఓఓఓ..యవ్వన వీణ పువ్వుల వాన

చరణం::1

నువ్వంటు పుట్టినట్టు..నా కొరకు
ఆచూకి అందలేదు..ఇంతవరకూ
వచ్చిందిగాని ఈడు..ఒంటివరకూ
వేధించలేదు నన్ను..జంట కొరకు
చూసాక ఒక్కసారి..ఇంత వెలుగు
నా వంక రాను..అంది కంటి కునుకు
ఈ అల్లరీ ఈ గారడీ..నీ లీల అనుకోనా
నీ పేరు..ప్రేమ ఔనా
ఇవాళే..నిన్ను పోల్చుకున్నా
ఓఓఓఓ..యవ్వన వీణ పువ్వుల వాన

చరణం::2

ఏ పూలతీగ కాస్త..ఊగుతున్నా
నీ లేత నడుమే..అనుకున్నా
ఏ గువ్వ కిలకిల..వినబడినా
నీ నవ్వులేనని..వెళుతున్నా
మేఘాల మెరుపులు..కనపడినా
ఏ వాగు పరుగులు..ఎదురైనా
ఆ రంగులో..ఆ పొంగులో 
నీ రూపే...చూస్తున్నా
నీ పేరు...ప్రేమ ఔనా
ఇవాళే..నిన్ను పోల్చుకున్నా
ఓఓఓఓ..యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు..ప్రేమ ఔనా
ఇవాళే..నిన్ను పోల్చుకున్నా
నీ పేరు..ప్రేమ ఔనా
ఇవాళే..నిన్ను పోల్చుకున్నా

Pelli--1997
Music::S.A.RaajKumaar
Lyrics::Sirivennela
Singer::S.P.Baalu 
Film Directed by::Kodi Ramakrishna 
Cast::Vadde Naveen,Maheswari,Prthviraaj.  

:::::::::

OOOOOOOOOOOOO
yavvana veeNa..puvvula vaana
nuvvevarE naa edalO chErina maina 
navvulatO tuLLipaDE tunTari tillaanaa
nee pEru..prEma aunaa
ivaaLE ninnu..pOlchukunnaa
nee pEru..prEma aunaa
ivaaLE..ninnu pOlchukunnaa
OOOO..yavvana veeNa puvvula vaana

::::1

nuvvanTu puTTinaTTu..naa koraku
aachooki andalEdu..intavarakoo
vachchindigaani eeDu..onTivarakoo
vEdhinchalEdu nannu..janTa koraku
choosaaka okkasaari..inta velugu
naa vanka raanu..andi kanTi kunuku
ee allaree ee gaaraDee..nee leela anukOnaa
nee pEru..prEma aunaa
ivaaLE..ninnu pOlchukunnaa
OOOO..yavvana veeNa puvvula vaana

::::2

E poolateega kaasta..oogutunnaa
nee lEta naDumE..anukunnaa
ae guvva kilakila..vinabaDinaa
nee navvulEnani..veLutunnaa
mEghaala merupulu..kanapaDinaa
E vaagu parugulu..edurainaa
aa rangulO..aa pongulO 
nee roopE...choostunnaa
nee pEru...prEma aunaa
ivaaLE..ninnu pOlchukunnaa
OOOO..yavvana veeNa puvvula vaana
nuvvevarE naa edalO chErina maina
navvulatO tuLLipaDE tunTari tillaanaa
nee pEru..prEma aunaa
ivaaLE..ninnu pOlchukunnaa
nee pEru..prEma aunaa
ivaaLE..ninnu pOlchukunnaa

Thursday, September 24, 2015

రోజా--1992



సంగీతం::A.R.రెహమాన్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,సుజాత
Film Directed By::Maniratnam
తారాగణం::మధుబాల,అరవిందస్వామి.
పల్లవి::

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదినే నీవైతే..అల నేనే
ఒక పాటా నీవైతే..నీ రాగం నేనే 

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

చరణం::1

నీ చిగురాకు చూపులే..అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే..అవి నా బంగారు నిధులే
నీ పాలపొంగుల్లో తేలనీ..నీ గుండెలో నిందనీ
నీ నీడలా వెంట సాగనీ..నీ కళ్ళల్లో కొలువుండనీ 

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే 

చరణం::2

నీ గారాల చూపులే..నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే..నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో..నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో..నీ పరువాలు పలికించుకో

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

నదినే నీవైతే..అల నేనే
ఒక పాటా నీవైతే..నీ రాగం నేనే 
పరువం వానగా..నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో..ఈడు తడిసేనులే

Rojaa--1992
Music::A.R.Rehman
Lyrics::Rajasree
Singer's::Balu,Sujatha
Film Directed By::Maniratnam
Cast::Madhubala,Aravindaswaami.

::::

paruvam vaanagaa neDu kurisenule
muddu muripaalalO eeDu taDisenule
naa oDilOna oka veDi segaregene
aa saDilOna oka tODu eda kOrene

paruvam vaanagaa neDu kurisenule
muddu muripaalalO eeDu taDisenule
naa oDilOna oka veDi segaregene
aa saDilOna oka tODu eda kOrene
nadine neevaite..ala nene
oka paaTaa neevaite..nee raagam nene 

paruvam vaanagaa neDu kurisenule
muddu muripaalalO eeDu taDisenule

::::1

nee chiguraaku choopule..avi naa mutyaala sirule
nee chinnaari oosule..avi naa bangaaru nidhule
nee paalapongullO telanee..nee gunDelO nindanee
nee neeDalaa venTa saaganee..nee kaLLallO koluvunDanee 

paruvam vaanagaa neDu kurisenule
muddu muripaalalO eeDu taDisenule
naa oDilOna oka veDi segaregene
aa saDilOna oka tODu eda kOrene
paruvam vaanagaa neDu kurisenule
muddu muripaalalO eeDu taDisenule 

::::2

nee gaaraala choopule..naalO repenu mOham
nee mandaara navvule..naake vesenu bandham
naa leta madhuraala premalO..nee kalalu panDinchukO
naa raagabandhaala chaaTulO..nee paruvaalu palikinchukO

paruvam vaanagaa neDu kurisenule
muddu muripaalalO eeDu taDisenule
naa oDilOna oka veDi segaregene
aa saDilOna oka tODu eda kOrene

nadine neevaite..ala nene
oka paaTaa neevaite..nee raagam nene 
paruvam vaanagaa..neDu kurisenule
muddu muripaalalO..eeDu taDisenule

Tuesday, September 22, 2015

ప్రేమ విజేత--1992



సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,S.జానకి
Film Director::K.Sadasivarao 
తారాగణం::సురేష్,హరీష్,యమున,రోజా,కోట,గోకిన రామారావు.

పల్లవి::

నిస రిమ పద నిద సా నిసని
నిస రిమ పద నిద సా నిసని
శభాష్ 
సరి నిస దని పదమా
సరి నిస దని పదమా
మపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల 
నండూరి ఎంకిలా నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే 
ఆత్రేయ పాటలాఉన్నాయి నా నీడగా 
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె 
నీలో తొలి అందాల తోటలే 
ఆత్రేయ పాటలా ఉన్నాయి నా నీడగా

చరణం::1

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమా..ఆ 
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ..ఆ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..ఈ 
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..ఓ
నీలో అల గోదారి ఎన్నెల 
నండూరి ఎంకిలా నవ్వింది నా తోడుగా
హహ..మలి సందెలలో పొంచీ ఉన్నా 
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ..ఊ
పరువాల పొద్దెరుపూ..ఊ 
కడియాల కాలెరుపూ..ఊ
కలహాల కన్నెరుపూ..ఊ
హా..హా..

చరణం::2

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే 
ఉప్పొంగి పోయే నీ తపన వలన..ఆ 
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే..ఏఏ
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే..నీలో..ఓ
నీలో తొలి అందాల తోటలే 
ఆత్రేయ పాటలా ఉన్నాయి నా నీడగా 
నీలో..ఓ..అల గోదారి ఎన్నెల 
నండూరి ఎంకిలా నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా..ఆ..వగలొలికె 
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా 
నవ్వింది నా తోడుగా..ఆ

Monday, September 21, 2015

భక్త ప్రహ్లాద--1967



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::సముద్రాలరాఘవాచారి
గానం::P.సుశీల
తారాగణం::హరినాథ్,S.V.రంగారావు,అంజలిదేవి,బేబిరోజారమణి రమణారెడ్డి,

పల్లవి::

ఆదుకోవయ్యా..ఓ..రమేశా..ఆ..ఆదుకోవయ్యా
పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవ
భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా..ఆ
ఆదుకోవయ్యా

బృందం:: 

సర్వలోకకారణా..సకలశోక వారణా
జన్మజన్మకారణా..జన్మబంధ మోచనా..ఆ
దుష్టగర్వ శిక్షణా..శిష్ట శాంతి రక్షణా..శాంతి రక్షణా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవే కదా 

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు 
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ 

నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా

హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీపద యుగళీ సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా ..పన్నగశయనా నారాయణా
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

భవజాధినిబడి తేలగలేని..జీవులబ్రోచే పరమపురుషా 
నను కాపాడి నీ బిరుదమునూ..నిలుపుకొంటివా శ్రితమందారా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

విశ్వమునిందీ వెలిగే నీవే..నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగ్నేలా..విషధర శయనా విశ్వపాలనా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా దేవా

Sunday, September 20, 2015

మిస్సమ్మ--1955::కాపీ::రాగం



సంగీతం::సాలూరిరాజేశ్వరరావు
రచన::పింగళినాగేద్రరావు
గానం::A.M.రాజ
Film Directed By::L.V.Prasad
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,జమున,రేలంగి,ANR,S.V.రంగారావురమణారెడ్డి.
కాపీ::రాగం 

పల్లవి::

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

చరణం::1

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మరియాదగా పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

చరణం::2

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

Missamma--1955
Music::Saluri Rajeshwar rao
Lyrics::PingalinagendraRao
Singer::A.M.Raja
Film Directed By::L.V.Prasad
Cast::NT Rama Rao, Akkineni Nageshwar Rao, Savitri
kaapii::raagam

:::::::::

avunanTE kAdanilE kAdanTE avunanilE
avunanTE kAdanilE kAdanTE avunanilE
ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE

::::1

aligi tolagi nilichinachO
aligi tolagi nilichinachO
chelimi jEya rammanilE
chorava chEsi rammanuchO
chorava chEsi rammanuchO
mariyAdagA pommanilE

ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE

::::2

visigi nasigi kasirinachO
visigi nasigi kasirinachO
vishayamasalu ishTamulE
tarachi tarachi UsaDigina
tarachi tarachi UsaDigina
sarasamiMka chAlanilE

ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE
avunanTE kAdanilE kAdanTE avunanilE
avunanTE kAdanilE kAdanTE avunanilE
ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE

Saturday, September 19, 2015

భక్తి గీతం



గానం::S.జానకి
 Private Bhakti Songs

పల్లవి::

ఎలుకపైన ఊరేగి 
ఎల్లలోకముల తిరిగి 
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను

ఎలుకపైన ఊరేగి 
ఎల్లలోకముల తిరిగి 
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను

చరణం::1

మోదకముల నైవేద్యము 
భుజియించుచు కడుపారా 
మోదమందు విఘ్నేశ్వరా..ఆ
భక్తుల మొక్కులు కొనుమో దొరా

మోదకముల నైవేద్యము 
భుజియించుచు కడుపారా 
మోదమందు విఘ్నేశ్వరా..ఆ
భక్తుల మొక్కులు కొనుమో దొరా

ఎలుకపైన ఊరేగి 
ఎల్లలోకముల తిరిగి 
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను

చరణం::2

ఎన్నెన్నో అడ్డంకులు ఈ
బ్రతుకు పొడుగునా
అన్ని అడ్లు తీరునట్లు
వరమియ్యగ బిరానా
వేడెదొమో గజవదనా..ఆ
గతి వేరెవరు నిను వినా..ఆ

ఎలుకపైన ఊరేగి 
ఎల్లలోకముల తిరిగి 
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను

చరణం::3

లోకములో మొదటి పూజ 
నీకే గద విఘ్నరాజ
నీఘనతకు వేరేల నిదర్శనం..మ్మ్
మాకు నీ వొసగుము నీ దర్శనం

లోకములో మొదటి పూజ 
నీకే గద విఘ్నరాజ
నీఘనతకు వేరేల నిదర్శనం..మ్మ్
మాకు నీ వొసగుము నీ దర్శనం

ఎలుకపైన ఊరేగి 
ఎల్లలోకముల తిరిగి 
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను

Thursday, September 17, 2015

ముద్దులమేనల్లుడు--1990



సంగీతం::K.V.మహదేవన్
రచన::వెన్నెలకంటి 
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం, K.S.చిత్ర, S.P.శైలజ
Film Directed By:::Kodi Ramakrishna
తారాగణం::బాలకృష్ణ,విజయశాంతి.

పల్లవి::

ముత్యాల పందిరిలో..మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం..ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్నీ పండే దేపుడెమ్మా..ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో..మూడు ముళ్ళ మూర్తం 
ముందుంది ఓ చిన్నమ్మ..ముత్తైడు భాగ్యాలిస్తుంది
ఇది మొదలె నమ్మ..ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయిలోన..దొర వయసు వాయనాలు 
ఇవ్వాలమ్మ..

చరణం::1

పసుపు పారాణి బొట్టు కాటుక దిద్దిన
నా రాణి నాకే కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షిగా
మాటే మనుగదగా మనమే పాటగా
సాగాలి జీవితము..చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం..గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గేణమ్మ లగ్నమంటూ

చరణం::2

తేనెకు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు 
వేచదనం తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం కలిగే రేయిలో
వలపుల మూల ధనం పెరిగే హాయిలో
అందాల వెల్లువలో..వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడుగా..వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు..వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీట గా..జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవంగా
ముత్యాల పందిరిలో..మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం..ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ

Saturday, September 12, 2015

పొరుగింటి పుల్లకూర--1976



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

చుక్కలలో దిక్కులలో..ఈరేయీ..ఈ
పాడింది మా పెళ్లి..సన్నాయీ..ఈ 
చుక్కలలో దిక్కులలో..ఈరేయీ 
పాడింది మా పెళ్లి..సన్నాయీ
చెలరేగెను తీయని పులకింతా..ఆఆఆ
వెన్నెలకూడా..వేడి వేడిగా 
వెన్నెలకూడా..వేడి వేడిగా
ఆరడి పెట్టి..గారడీ చేస్తే
ఏమైపోనమ్మా..నేనేమైపోనమ్మా..ఆఆఆ 
చుక్కలలో దిక్కులలో..ఈరేయీ 
పాడింది మా పెళ్లి..సన్నాయీ

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
వెళ్లొస్తా..ఆ..న్నన్నదీ..కన్నెతనం
వచ్చేశా..ఆ..న్నన్నదీ..కలికితనం
వెళ్లొస్తా..ఆ..న్నన్నదీ..కన్నెతనం
వచ్చేశా..ఆ..న్నన్నదీ..కలికితనం
వెళ్లుమరి..ఊ..వెళ్లుమరి..అన్నదమ్మా పడుచుదనం
వెళ్లలేకా..ఆ..ఉండలేకా..ఆ
వెళ్లలేకా..ఆ..ఉండలేకా..ఆ 
ఉన్నచోట నిలువలేక..తుళ్లి తుళ్లి పడిందీ ఆడతనం  
చుక్కలలో దిక్కులలో..ఈరేయీ..ఈ  
పాడింది మా పెళ్లి..సన్నాయీ..ఈ 

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
వయసొచ్చిన పిల్లకి..వలపే అందం
వలపుకానుకే..బంధం
మనసిచ్చిన వేళా..మాటే మంత్రం  
అదే..మంగళసూత్రం
కలలుగనీ..మనసుపడీ 
కలలుగనీ..మనసుపడీ
కౌగిలిలో..కరగాలని
ఎదురు చూసి..నిదుర కాచి 
ఎదురు చూసి..నిదుర కాచి
ఆ రూపే మది..నిలిపిన 
కన్నె మనసే..కళ్యాణమంటపం
చుక్కలలో దిక్కులలో..ఈరేయీ 
పాడింది మా పెళ్లి..సన్నాయీ
చెలరేగెను తీయని..పులకింత..ఆఆఆ
వెన్నెలకూడా..వేడివేడిగా
వెన్నెలకూడా..వేడివేడిగా
ఆరడి పెట్టి..గారడీ చేస్తే 
ఏమైపోనమ్మా..నేనేమైపోనమ్మా

Poruginti Pullakura--1976
Music::Chakravarti
Lyrics::VeeturiSundaraRamaMoorti
Singer::P.Suseela
Film Directed By::V.Madhusoodhana Rao 
Cast::Raamakrshna,Kaanchana,Muralimohan,Jayachitra,Raajabaabu,Mamata,Nirmala,Kaakaraala

:::::::::

chukkalalO dikkulalO..iirEyii..ii
paaDindi maa peLLi..sannaayii..ii 
chukkalalO dikkulalO..iirEyii 
paaDindi maa peLLi..sannaayii

chelarEgenu teeyani pulakintaa..aaaaaa
vennelakooDaa..vEDi vEDigaa 
vennelakooDaa..vEDi vEDigaa
aaraDi peTTi..gaaraDii chEstE
EmaipOnammaa..nEnEmaipOnammaa..aaaaaa 
chukkalalO dikkulalO..iirEyii 
paaDindi maa peLLi..sannaayii

:::1

aa aa aa aa aa aa aa aa aa 
veLLostaa..aa..nnannadii..kannetanam
vachchESaa..aa..nnannadii..kalikitanam
veLLostaa..aa..nnannadii..kannetanam
vachchESaa..aa..nnannadii..kalikitanam
veLLumari..oo..veLlumari..annadammaa paDuchudanam
veLLalEkaa..aa..unDalEkaa..aa
veLLalEkaa..aa..unDalEkaa..aa 
unnachOTa niluvalEka..tuLLi tuLLi paDindii aaDatanam  
chukkalalO dikkulalO..iiraEyii..ii  
paaDindi maa peLli..sannaayii..ii 

::::2

aa aa aa aa aa aa aa aa aa 
vayasochchina pillaki..valapE andam
valapukaanukE..bandham
manasichchina vELaa..maaTE mantram  
adE..mangaLasootram
kalaluganE..manasupaDii 
kalaluganE..manasupaDii
kaugililO..karagaalani
eduru choosi..nidura kaachi 
eduru choosi..nidura kaachi
aa roopE madi..nilipina 
kanne manasE..kaLyaaNamanTapam

chukkalalO dikkulalO..iirEyii 
paaDimdi maa peLLi..sannaayii
chelarEgenu tiiyani..pulakinta..aaaaaa
vennelakooDaa..vEDi vEDigaa
vennelakooDaa..vEDi vEDigaa
aaraDi peTTi..gaaraDii chEstE 
EmaipOnammaa..nEnEmaipOnammaa

Friday, September 11, 2015

శ్రీవేమన చరిత్ర--1986



సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::C.S.Rao 
తారాగణం::చంద్రమోహన్,భానుచందర్,అర్చన,K.R.విజయ.

పల్లవి::

నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ఆరు రుతువులకు..ఇదే పల్లవి 
జన్మకిదే..నా..పూజావలీ..ఈఈఈ 
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము..ఊఊఊ
నేను నాట్యము..ఊ..నీవు వేదము

చరణం::1

మామితోటల..మల్లికలలో 
మొవిదాటిన..అల్లికలో
కోయిలల్లే ఎగసి పాడే కోరికలతో..ఓఓఓ 
ఎన్నికళ్ళలో మొసుకొచ్చే ఈ వసంతం
గ్రీషమైన..విడిచిపోను..ఊఊఊఊఊఊ
విరహమల్లే..నిలిచిపోను..ఊఊఊఊఊ
గ్రీషమైన..విడిచిపోను..ఊ
విరహమల్లే..నిలిచిపోను..ఊ
వేడి వలపే వేసవి 
నీ నీడ మల్లెల పందిరి..ఈఈఈఈఈ
నేను నాట్యము..ఊ..నీవు వేదము
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము

చరణం::2

శ్రావణ సంధ్యా..రాగాలు
ఆ..హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శ్రావణ సంధ్యా..రాగాలు
మధురసంగమ..స్నానాలు..ఊ 
తేటగీతిలా తేనే వెన్నెల తేలివస్తుంటే..ఏఏఏ
ఆట వెలదిల హంసమేఘమే సాగివస్తుంటే..ఏఏఏ
పూటపూటకి పున్నమలే తెల్లవారినా వెన్నెలలే..ఈఈఈఎ 
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము

చరణం::3

లేత పెదవే పుష్యరాగం 
సిగ్గుపడితే మంచు ముత్యం
బంతులు చేమంతులు పసుపుపారాణులు 
మంచులో చలిమంటలే అగ్నిసాక్షాలు 
రుతువులెన్నో..మారుతున్నా..ఆ ఆ ఆ 
వయసు నాలో..వణుకుతున్న..ఆ ఆ ఆ 
రుతువులెన్నో..మారుతున్నా..ఆ  
వయసు నాలో..వణుకుతున్న..ఆ 
శిశిరమైన శిధిలమైన చెరిగిపోదీ అనురాగం..మ్మ్
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ఆరు రుతువులకు ఇదే పల్లవి 
జన్మకిదే నా పూజావలి..ఈఈఈఈ
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము

విచిత్ర బంధం--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దాశరథి
గానం::ఘంటసాల ,సుశీల
Film Directed By::Adurthi SubbaRao 

తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,అల్లురామలింగయ్య,రాజబాబు,పద్మనాభం,రమాప్రభ,సూర్యకాంతం,S.V.రంగారావు,
అంజలిదేవి,నాగయ్య,రాధాకుమారి.

పల్లవి:: 

చల్లని బాబూ..నా అల్లరి బాబూ 
నా కంటి పాపవు..నీవే 
మా యింటి దీపం..నీవే
చల్లని బాబూ..నా అల్లరి బాబూ

చరణం::1

పంచవన్నెల రామచిలకను..పలకరించబోయేవు 
పంచవన్నెల రామచిలకను..పలకరించబోయేవు 
వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వెసేవు 
నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను 
బాబూ..చల్లని బాబూ..నా అల్లరి బాబూ 
నా కంటిపాపవు నీవే..మా యింటి దీపం నీవే

చరణం::2

ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ వున్నాను 
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను
ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ వున్నాను 
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను

అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు 
చల్లని బాబూ..నా అల్లరి బాబూ 
నా కంటి పాపవు నీవే మా యింటి దీపం నీవే

చరణం::3

నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా 
చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా 
నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నవా 
నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలుకావా  

Vichitra Bandham--1972
Music::K V Mahadevan
Lyrics::Dasaradhi
Singer's::Ghantasala,P.Suseela
Film Directed By::Adurthi SubbaRao 
Cast::A.N.R.Vanisree,Alluraamalingayya,S.V.Rangarao,Padmanabham,Ramaprabha,Nagayya,Anjalidevi,Sooryakaantam,Rajababu,Raadhakumaari.

:::::::::

Challani baabuu..naa allari baabuu 
naa kanTi paapavu..neevE 
maa inTi deepam..neevE
Challani baabuu..naa allari baabuu

::::1

panchavannela raamachilakanu palakarinchaboyEvu  
panchavannela raamachilakanu palakarinchaboyEvu
vintha chaeshtala kothula choosi  ganthulenno vesaevu 
nee palukulu vintoo parugulu  chuusthuu paravasamaipotaanu
baabuu..challani baabuu naa allari baabuu 
naa kanTi paapavu neevE..maa inTi deepam neevE

::::2

ennenno aasalatoTii eduru choostoo vunnaanu 
vechchani oDilo ninnu daachi muchchaTalennO chebutaanu
ennenno aasalatoTii eduru choostoo vunnaanu 
vechchani oDilo ninnu daachi muchchaTalennO chebutaanu

ammaa naannala anuraagamlo apuroopamgaa perigEvu
challani baabuu naa allari baabuu 
naa kanTi paapavu neevE maa inTi deepam neevE

::::3

nee baabunu talli aadarinchunani bhramapaDutunnaavaa 
chitikipoyina maguva manasulO mamatalu vetikEvaa 
neevu chEsina anyaayaanni marachindanukunnavaa 
nee aalochanalu anubandhaalu adiyaasalukaavaa

భాగ్య చక్రం--1968



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు 
రచన::పింగళినాగేంద్రరావు 
గానం::ఘంటసాల గారు
Film Directed By::Kadiri Venkata Reddy
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,రాజనాల,గీతాంజలి,పద్మనాభం,ముక్కామల

పల్లవి::

ఆశ నిరాశను చేసితివా
ఓహో..ఓ..ఒ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఓహో..ఓ..ఓ..ఓ..ఒ..ఓ..ఓ..ఓ..ఓ
ఆశ నిరాశను చేసితివా 
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా
ఆశ నిరాశను చేసితివా 
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా

చరణం::1

తోడుగ నడిచేవనీ..ఈ
నా నీడగ నిలిచేవనీ..ఈ
తోడుగ నడిచేవనీ..ఈఈఇ 
నా నీడగ నిలిచేవనీ..ఈ
జీవితమే ఒక స్వర్గముగ 
ఇక చేసెదవని నే తలచితినే
ఆశ నిరాశను చేసితివా 
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా

చరణం::2

నా ప్రాణము నీవేయని..ఈ 
నా రాణివి నీవే అని..ఈ
నా ప్రాణము నీవేయని..ఈ 
నా రాణివి నీవే అని..ఈ
రాగముతో అనురాగముతో 
నను ఏలెదవని నే నమ్మితినే
ఆశ నిరాశను చేసితివా..ఆ 
రావా చెలియా రాలేవా..ఆ
రావా చెలియా రాలేవా..ఆ

Bhagya Chakram--1968
Music::PendyaalaNaagesvaraRaO 
Lyrics::PingaLiNaagendraRao 
Singer::Ghantasaala Gaaru
Film Directed By::Kadiri Venkata Reddy
Cast::::N.T.RaamaaRao,B.Sarojaadevi,Raajanaala,Geetaanjali,Padmanaabham,Mukkaamala

:::::::::

OhO..O..o..O..O..O..O..O..O
OhO..O..O..O..o..O..O..O..O
aaSa niraaSanu chEsitivaa 
raavaa cheliyaa raalEvaa
raavaa cheliyaa raalEvaa
aaSa niraaSanu chEsitivaa 
raavaa cheliyaa raalEvaa
raavaa cheliyaa raalEvaa

::::1

tODuga naDichEvanee..ii
naa neeDaga nilichEvanee..ii
tODuga naDichEvanee..iiiii 
naa neeDaga nilichEvanee..ii
jeevitamE oka swargamuga 
ika chEsedavani nE talachitinE
aaSa niraaSanu chEsitivaa 
raavaa cheliyaa raalEvaa
raavaa cheliyaa raalEvaa

::::2

naa praaNamu neevEyani..ii 
naa raaNivi neevE ani..ii
naa praaNamu neevEyani..ii 
naa raaNivi neevE ani..ii
raagamutO anuraagamutO 
nanu Eledavani nE nammitinE
aaSa niraaSanu chEsitivaa..aa 
raavaa cheliyaa raalEvaa..aa
raavaa cheliyaa raalEvaa..aa

గీతాంజలి--1989



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::K.S.చిత్ర 
Film Directed By::Mani Ratnam
తారాగణం::నాగార్జున అక్కినేని,గిరిజా షెట్టర్,విజయకుమార్,విజయచంద్ర.

పల్లవి:: 

జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే 
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే 
ఉరుకులో..పరుగులో 
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు 
తొలకరి..మెరుపులా 
ఉలికిపడిన కలికి సొగసు 

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే 
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే 

చరణం::1

వాగులు వంకులు గలగలా చిలిపిగా పిలిచినా 
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా 
మనసు ఆగదు ఇదేమి అల్లరో 
తనువు దాగదు అదేమి తాకిడో 
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి 
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి 

చరణం::2 

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా 
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా 
వానదేవుడే కళ్ళాపి జల్లగా 
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా 
నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న 
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో ఒహో

Geetanjali--1989
Music::IlayaRaja
Lyrics::Veeturisundararaamamoorti
Singer::K.S.Chitra 
Film Directed By::Mani Ratnam 
Cast::Nagarjuna Akkineni, Girija Shettar, Vijayakumar, Vijayachander

::::::::: 

jallanta kavvinta kaavaalilE 
oLLanta tuLLinta raavaalilE 
jallanta kavvinta kaavaalilE 
oLLanta tuLLinta raavaalilE 
urukulO..parugulO 
uDuku vayasu duDukutanamu nilavadu 
tolakari..merupulaa 
ulikipaDina kaliki sogasu 

konDamma kOnamma mechchindilE 
enDallo vennellu techchindilE 
konDamma kOnamma mechchindilE 
enDallo vennellu techchindilE 

::::1

vaagulu vankulu galagalaa chilipigaa pilichinaa 
gaalulu vaanalu chiTapaTaa chinukulE chilikinaa 
manasu aagadu idEmi allarO 
tanuvu daagadu adEmi taakiDO 
kOnachaaTu konDamalle lEnivanka muddulaaDi 
veLLaDaaye kaLLu lEni dEvuDendukO mari 

::::2 

sandelO rangulE nosaTipai tilakamE nilupagaa 
teli teli manchulE teliyani tapanalE telupagaa 
vaanadEvuDE kaLLaapi jallagaa 
vaayudEvuDE muggEsi veLLagaa 
neelikonDa gunDelOni oosulanni telusukunna 
kotta paaTa puTTukochche evarikOsamO ohO

Thursday, September 10, 2015

స్వయంవరం--1982



సంగీతం::చెళ్ల పిళ్ల సత్యం
రచన::దాశరినారాయణరావు
గానం::K.J.ఏసుదాసు
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,నారాయణరావు,రావ్‌గోపాల్‌రావ్,గుమ్మడి.

పల్లవి::

గాలి వానలో..ఓఓఓ 
వాన నీటీలో..ఓఓఓ
గాలి వానలో వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో..తెలెయదు పాపం

గాలి వానలో వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో..తెలెయదు పాపం
ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ

చరణం::1

ఇది హోరు గాలి అని తెలుసూ..ఊ
అటు వరద పొంగు అని తెలుసూ..ఊ
ఇటు హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ
హోరు గాలిలో వరద పొంగులో..సాగలేనని తెలుసూ
అది జోరు వాన అని తెలుసూ..ఊ
ఇది నీటి సుడులని తెలుసూ..ఊ
అది జోరు వాన అని తెలుసూ..ఇది నీటి సుడులని తెలుసూ 
జోరు వానలో..నీటి సుడులలో..మునక తప్పదని తెలుసు 
ఐనా పడవ ప్రయాణం..తీరమెక్కడో గమ్యమేమిటో 
తెలెయదు పాపం..తెలెయదు పాపం
ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ

చరణం::2

ఇది ఆశ నిరాశల ఆరాటం..మ్మ్
అది చీకటి వెలుగుల చెలగాటం..మ్మ్
ఇది ఆశ నిరాశల ఆరాటం..అది చీకటి వెలుగుల చెలగాటం 
ఆశ జారినా వెలుగు తొలగినా..ఆగదు జీవిత పోరాటం 
ఇది మనిషి మనసుల పోరాటం..మ్మ్
అది ప్రేమ పెళ్ళి చెలగాటం..మ్మ్
ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం 
ప్రేమ శకలమై మనసు వికలమై..బ్రతుకుతున్నదొక శవం 
ఐనా పడవ ప్రయాణం..తీరమెక్కడో గమ్యమేమిటో 
తెలెయదు పాపం..తెలెయదు పాపం

గాలి వానలో వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో..తెలెయదు పాపం
ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ

Swayamvaram--1982--1982
Music::Chellapalli Satyam
Lyrics::Dasari Naraayana Rao
Singer::K.J.Esudaas
Film Director::Dasari Naraayana Rao
Cast::Sobhanbaabu,Jayaprada,Naaraayanaraavu,RaoGopalRao,Gummadi.

:::::

gaali vaanalO..OOO 
vaana neeTeelO..OOO
gaali vaanalO vaana neeTeelO..paDava prayaaNam
teeramekkaDO gamyamEmiTO..teleyadu paapam

gaali vaanalO vaana neeTeelO..paDava prayaaNam
teeramekkaDO gamyamEmiTO..teleyadu paapam
O O O O o O O O O O o O O O O O o OOO

::::1

idi hOru gaali ani telusoo..oo
aTu varada pongu ani telusoo..oo
iTu hOru gaali ani telusoo
aTu varada pongu ani telusoo
hOru gaalilO varada pongulO..saagalEnani telusoo
adi jOru vaana ani telusoo..oo
idi neeTi suDulani telusoo..oo
adi jOru vaana ani telusoo..idi neeTi suDulani telusoo 
jOru vaanalO..neeTi suDulalO..munaka tappadani telusu 
ainaa paDava prayaaNam..teeramekkaDO gamyamEmiTO 
teleyadu paapam..teleyadu paapam
O O O O o O O O O O o O O O O O o OOO

::::2

idi aaSa niraaSala aaraaTam..mm^
adi cheekaTi velugula chelagaaTam..mm^
idi aaSa niraaSala aaraaTam..adi cheekaTi velugula chelagaaTam 
aaSa jaarinaa velugu tolaginaa..aagadu jeevita pOraaTam 
idi manishi manasula pOraaTam..mm^
adi prEma peLLi chelagaaTam..mm^
idi manishi manasula pOraaTam..adi prEma peLLi chelagaaTam 
prEma Sakalamai manasu vikalamai..bratukutunnadoka Savam 
ainaa paDava prayaaNam..teeramekkaDO gamyamEmiTO 
teleyadu paapam..teleyadu paapam

gaali vaanalO vaana neeTeelO..paDava prayaaNam
teeramekkaDO gamyamEmiTO..teleyadu paapam
O O O O o O O O O O o O O O O O o OOO

Wednesday, September 09, 2015

బొబ్బిలి దొర--1997


సంగీతం::కోటి
రచన::J.సుధాకర్
గానం::K.J.ఏసుదాసు
సినిమా దర్శకత్వం::కామేశ్వరరావు బోయపాటి
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,సంఘవి. 

పల్లవి::

ఏమి చేయగలదు ఏ సాగరమైనా
తన మీదే అలక బూని అలలు వెళ్ళి పోతుంటే
ఏమి చేయగలదు..ఏ హృదయమైనా
కంటిలో నలకుందని కలలు జారి పోతుంటే

బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈఈ
జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా
కడుపు కోత తప్పదు..ఈ దేవుడికీ..ఓ
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ

చరణం::1

ఏడడుగులు వెనక నడిచీ ఎదలో సగమైన మనిషీ
ఇరుసు లేని బండినెక్కీ ఇల్లు విడిచి వెల్లిందా
ఇంటి దీపమౌతుందనీ..కంటి పాపలా చూస్తే
కన్న పేగు బంధమేమో..కన్ను పొడిచి పోయిందా
కొరివి తలకు పెట్టినోడు..కొడుకౌతాడింటా
కొరివి తలకు పెట్టినోడు..కొడుకౌతాడింటా
కొంపకు నిప్పెట్టినోడు..ఏమౌతాడంటా
ఏమౌతాడంటా?
బొమ్మలెన్ని చేసినా..ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు..ఆ బ్రహ్మయ్యకీ..ఈ

చరణం::2

కలి కాలపు జూదంలో కడుపు తీపి ఓడితే
వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా
నావ తోడు లేదనీ..ఏరు ఒంటరౌతుందా
పొద్దు వాలి పోయిందనీ నింగి దిగులు పడుతుందా
కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు
కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు
నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరూ
చెప్పేది ఎవరూ?

బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
జన్మనిచ్చి పెంచినా..ప్రేమ ఎంత పంచినా
కడుపు కోత తప్పదు..ఈ దేవుడికీ..ఓ
బొమ్మలెన్ని చేసినా..ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు..ఆ బ్రహ్మయ్యకీ..ఈ

Tuesday, September 08, 2015

డిటెక్టివ్ నారద--1993



సంగీతం::ఇళయరాజా
రచన::పింగళి,వంశీ
Film Director::Vamshi
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::మోహన్‌బాబు,మోహిని,నిరోష.
పల్లవి::

యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా..హహ హాహా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో..అహహా అహహా హహా
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా..హహ హాహా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో..ఓ

చరణం::1

చుంచుం..హాయ్హాయ్..చుంచుం..హోయ్హోయ్
చుంచుం..హాయ్హాయ్..చుంచుం..హోయ్హోయ్

యవ్వనాలు గిల్లుకున్న..వన్నెలమ్మకి
ఆ వెన్నెలమ్మ..జాడ చెప్పవా
చెలి నగుమోమే చంద్రబింబమై..పగలే వెన్నెల కాయగా
అహహా..అహా అహహహా..ఆహహహా
చెలి నగుమోమే చంద్రబింబమై..పగలే వెన్నెల కాయగా
వెన్నెల పొదలో మల్లెల..గుడిలో విరహంతో సఖి రగలాలా
సఖి నెరిచూపుల..చల్లదనంతో జగములె ఊటీశాయగా
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా..హహ హాహా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ..ఏలనో..ఓ

చరణం::2

చుంచుం..హాయ్హాయ్..చుంచుం..హోయ్హోయ్
చుంచుం..హాయ్హాయ్..చుంచుం..హోయ్హోయ్

కన్నెప్రేమ లేని లేత కన్నె గువ్వకి..నీకున్న ప్రేమ దోచి పెట్టవా
కన్నవారినే మరువ జేయుచూ..అన్ని ముచ్చటలు తీర్చనా
అహహా..అహా..అహహహా..ఆహహహా
కన్నవారినే మరువ జేయుచూ..అన్ని ముచ్చటలు తీర్చనా
ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులై నీ ఆదరణే
సతి ఆదరణే..పతికి మోక్షమని సర్వశాస్తమ్రులు చాటగా
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా..హహ హాహా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో..ఓ

వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు..చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో..అహహా అహహా హహా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా..హహ హాహా 
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో