Friday, September 11, 2015

శ్రీవేమన చరిత్ర--1986



సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::C.S.Rao 
తారాగణం::చంద్రమోహన్,భానుచందర్,అర్చన,K.R.విజయ.

పల్లవి::

నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ఆరు రుతువులకు..ఇదే పల్లవి 
జన్మకిదే..నా..పూజావలీ..ఈఈఈ 
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము..ఊఊఊ
నేను నాట్యము..ఊ..నీవు వేదము

చరణం::1

మామితోటల..మల్లికలలో 
మొవిదాటిన..అల్లికలో
కోయిలల్లే ఎగసి పాడే కోరికలతో..ఓఓఓ 
ఎన్నికళ్ళలో మొసుకొచ్చే ఈ వసంతం
గ్రీషమైన..విడిచిపోను..ఊఊఊఊఊఊ
విరహమల్లే..నిలిచిపోను..ఊఊఊఊఊ
గ్రీషమైన..విడిచిపోను..ఊ
విరహమల్లే..నిలిచిపోను..ఊ
వేడి వలపే వేసవి 
నీ నీడ మల్లెల పందిరి..ఈఈఈఈఈ
నేను నాట్యము..ఊ..నీవు వేదము
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము

చరణం::2

శ్రావణ సంధ్యా..రాగాలు
ఆ..హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శ్రావణ సంధ్యా..రాగాలు
మధురసంగమ..స్నానాలు..ఊ 
తేటగీతిలా తేనే వెన్నెల తేలివస్తుంటే..ఏఏఏ
ఆట వెలదిల హంసమేఘమే సాగివస్తుంటే..ఏఏఏ
పూటపూటకి పున్నమలే తెల్లవారినా వెన్నెలలే..ఈఈఈఎ 
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము

చరణం::3

లేత పెదవే పుష్యరాగం 
సిగ్గుపడితే మంచు ముత్యం
బంతులు చేమంతులు పసుపుపారాణులు 
మంచులో చలిమంటలే అగ్నిసాక్షాలు 
రుతువులెన్నో..మారుతున్నా..ఆ ఆ ఆ 
వయసు నాలో..వణుకుతున్న..ఆ ఆ ఆ 
రుతువులెన్నో..మారుతున్నా..ఆ  
వయసు నాలో..వణుకుతున్న..ఆ 
శిశిరమైన శిధిలమైన చెరిగిపోదీ అనురాగం..మ్మ్
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి
ఆరు రుతువులకు ఇదే పల్లవి 
జన్మకిదే నా పూజావలి..ఈఈఈఈ
నీవు రాగము..ఊ..నేను తాళ్ళము
నేను నాట్యము..ఊ..నీవు వేదము

No comments: