గానం::S.జానకి
Private Bhakti Songs
పల్లవి::
ఎలుకపైన ఊరేగి
ఎల్లలోకముల తిరిగి
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను
ఎలుకపైన ఊరేగి
ఎల్లలోకముల తిరిగి
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను
చరణం::1
మోదకముల నైవేద్యము
భుజియించుచు కడుపారా
మోదమందు విఘ్నేశ్వరా..ఆ
భక్తుల మొక్కులు కొనుమో దొరా
మోదకముల నైవేద్యము
భుజియించుచు కడుపారా
మోదమందు విఘ్నేశ్వరా..ఆ
భక్తుల మొక్కులు కొనుమో దొరా
ఎలుకపైన ఊరేగి
ఎల్లలోకముల తిరిగి
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను
చరణం::2
ఎన్నెన్నో అడ్డంకులు ఈ
బ్రతుకు పొడుగునా
అన్ని అడ్లు తీరునట్లు
వరమియ్యగ బిరానా
వేడెదొమో గజవదనా..ఆ
గతి వేరెవరు నిను వినా..ఆ
ఎలుకపైన ఊరేగి
ఎల్లలోకముల తిరిగి
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను
చరణం::3
లోకములో మొదటి పూజ
నీకే గద విఘ్నరాజ
నీఘనతకు వేరేల నిదర్శనం..మ్మ్
మాకు నీ వొసగుము నీ దర్శనం
లోకములో మొదటి పూజ
నీకే గద విఘ్నరాజ
నీఘనతకు వేరేల నిదర్శనం..మ్మ్
మాకు నీ వొసగుము నీ దర్శనం
ఎలుకపైన ఊరేగి
ఎల్లలోకముల తిరిగి
ఏలుచుందు వెల్లరును
గణపతి ఎటుపొగడుదు నీ మహిమలను
No comments:
Post a Comment