Tuesday, September 29, 2015

శ్రీ గౌరీ మహత్యం--1956


సంగీతం::ఓగిరాల రామచంద్రరావు / టి.వి.రాజు
రచన::మల్లాది
గానం::లీల 

పల్లవి::

అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
చూపే ఠీవీ చూసే చూపు 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా అమ్మా 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా

చరణం::1

అమ్మా నీవు అంగజ వైరీ..ఈఈఈఈ
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి 
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి
లీలగ మేలుగా లోకాలన్నీ 
లీలగ మేలుగా లోకాలన్నీ
ఏలే..ఆ..చిద్విలాసం

చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా అమ్మా
చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా

చరణం::2

అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన 
అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన
మేనులొకటై ఆదమరచి 
మేనులొకటై ఆదమరచి 
వేడుకగా చేసే నాట్యం 

చూడాలమ్మా కనుపండువుగా

No comments: