Wednesday, May 15, 2013

రక్త సంబంధం--1962




















సంగీతం::ఘంటసాల
రచన::అనిసెట్టి సుబ్బారావు
గానం::ఘంటసాల, P. సుశీల
తారాగణం::ఎన్.టి. రామారావు, సావిత్రి, కాంతారావు, దేవిక,సూర్యకాంతం

పల్లవి::

చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చరణం::1

అన్న ఒడి జేర్చి ఆటలాడించు..నాటి కధ పాడనా 
ఆనాటి కధ పాడనా..ఆ.. 
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా 
కన్నీటి కధ పాడనా..
కలతలకు లొంగి..కష్టముల క్రుంగు..కన్నీటి కధ పాడనా

కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే 
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే
మిగిలెనీ శోకమే..
విధియె విడదీసె..వెతలలో ద్రోసే..మిగిలెనీ శోకమే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిన్నుకన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే

చరణం::2

మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా..ఆ..
బంధమే నిల్పుమా..మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా..మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు..భువిలో మానవులు..ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే

లాలి పాపాయి హాయి పాపాయి..లాలి పాపాయి జో జో
లాలి పాపాయి జో జో…


Raktha Sambandham--1962
Music::Ghantasala
Lyricis::Anisetti Subba Rao
Singer's::Ghantasala,P.Susheela
Cast::N.T.Ramarao,Savitri,Kantarao.Devika,Suryakantam.
::::
Chanduruni minchu andamolikinchu muddu paapaayive
ninu kanna vaarinta kashtamula needa karigipoyenule
karunatho joochi kanaka durgamma kaamitamulicchule
lokamulanelu venkateshwarudu ninnu deevinchule

Chanduruni minchu andamolikinchu muddu paapaayive
ninu kanna vaarinta kashtamula needa karigipoyenule
karunatho joochi kanaka durgamma kaamitamulicchule
lokamulanelu venkateshwarudu ninnu deevinchule

:::1
Anna vodijerchi aatalaadinchu
naati katha paadanaa..A..A..A..aanaati katha paadanaa
kalatalaku longi kashtamula krungu
neti katha paadanaa..kanneeti katha paadanaa
kalatalaku..longi..kashtamula krungu
kanneeti katha paadanaa

Kantilo paapa intike jyoti
chelli naa praaname..chelli naa praaname
mamu vidhiye vidadeese vethalalo throse
migile nee sokame..migile nee sokame
vidhiye..vidadeese..vethalalo throse
migile..nee sokame..

Chanduruni minchu andamolikinchu muddu paapaayive
ninu kanna vaarinta kashtamula needa karigipoyenule

:::2

Manasulanu kalupu madhura bandhalu maasiporadule
perigi neevaina maama gaarinti manumune koruma..aa..
bandhame nilpumaa..maa bandhame nilpumaa

Kaalameduraina gathulu veraina mamathale maayuna
perigi neevaina atta gaarinta kodaliga cheruma
bandhame nilpumaa..maa bandhame nilpumaa
divilo thathalu..bhuvilo manavulu..dhoolilo kalasina
anna chellilla janma bandhaale nithyamai nilchule

Laali paapaayi haayi paapaayi..laali paapaayi jojo
laali paapaayi jojo..mmmmm..

No comments: