Wednesday, May 15, 2013

బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::కృష్ణ , విజయనిర్మల, రాజశ్రీ, రామకృష్ణ, గుమ్మడి, అంజలీదేవి 

పల్లవి::

చెలిదోసిట పోసిన మల్లియలు 
చిలికించేను ఏవో తేనియలు
పలికించేను లోలో వీణియలు                          
చెలిదోసిట పోసిన మల్లియలు 
చిలికించేను ఏవో తేనియలు
పలికించేను లోలో వీణియలు                          

చరణం::1

చిరుగాలి ననుచేరవచ్చింది
నా చెవిలోన గుసగుసలేవో చెప్పింది
చిరుగాలి ననుచేరవచ్చింది
నా చెవిలోన గుసగుసలేవో చెప్పింది
ఎటుతోచలేక ఏమాటరాక ఎదతుళ్ళి ఆడింది
పయ్యెద..జారిపోయింది
   
చెలిదోసిట పోసిన మల్లియలు 
చిలికించేను ఏవో తేనియలు
పలికించేను లోలో వీణియలు                          

చరణం::2

ఒకతార ఒయ్యారం ఒలికింది
నీ సఖుడెంత సొగసరి అంటూ అడిగింది
ఒకతార ఒయ్యారం ఒలికింది
నీ సఖుడెంత సొగసరి అంటూ అడిగింది
నెలరాజు కన్న నా రాజు మిన్న అన్నాను 
మనసారగా..నా అనుభూతి విరబూయగా 
                      
చెలిదోసిట పోసిన మల్లియలు 
చిలికించేను ఏవో తేనియలు
పలికించేను లోలో వీణియలు         

No comments: