సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,కృష్ణ, కృష్ణంరాజు,చంద్రమోహన్,రాజబాబు,విజయనిర్మల,రాజశ్రీ,విజయ లలిత
పల్లవి::
కూరకని రారా కొంటె కుర్రాడా
గోంగూరకని రారా ఒంటిగున్నారా
చాటుమాటు సైగజేసి జడిసి వెళ్ళకూ
సైయన్న పడుచుగుండె జారనివ్వకూ
కూరకని రారా కొంటె కుర్రాడా
గోంగూరకని రారా ఒంటిగున్నారా
చాటుమాటు సైగజేసి జడిసి వెళ్ళకూ
సైయన్న పడుచుగుండె జారనివ్వకూ
కూరకని రారా కొంటె కుర్రాడా
చరణం::1
చింతచెట్టు చిగురు జివ్వంటూ ప్రాణాన్ని
లాగేస్తా వుందిరో పగటేళలో..ఓఓఓఓఓ
చింతచెట్టు చిగురు జివ్వంటూ ప్రాణాన్ని
లాగేస్తా వుందిరో పగటేళలో
మామిళ్ళు యిరబూసి మనసంతా కలిచేసి మత్తేదో
సల్లింది నడిమాపులో మత్తేదో సల్లింది నడిమాపులో
మాపొక్క బాధ పగలొక్క బాధ మాపొక్క బాధ
పగలొక్క బాధ మతిలోన మతిలేదురో
కూరకని రారా కొంటె కుర్రాడా
గోంగూరకని రారా ఒంటిగున్నారా
కూరకని రారా కొంటె కుర్రాడా
చరణం::2
చల్లాకి పిల్లోడ చల్లని వేళ కన్నుల్లో
ఎన్నెల్లు పెనవేయరోయ్..ఓఓఓఓఓ
చల్లాకి పిల్లోడ చల్లాని వేళ కన్నుల్లో
ఎన్నెల్లు పెనవేయరోయ్
పదునైన వయసొచ్చి కుదురైన మనసులో గుబులంతా
రేపిందిరోయ్ ఒహోయ్ గుబులంతా రేపిందిరోయ్
కూరకని రారా కొంటె కుర్రాడా
గోంగూరకని రారా ఒంటిగున్నారా
చాటుమాటు సైగజేసి జడిసి వెళ్ళకూ
సైయన్న పడుచుగుండె జారనివ్వకూ
కూరకని రారా కొంటె కుర్రాడా
గోంగూరకని రారా ఒంటిగున్నారా
కూరకని రారా రారా రారా
No comments:
Post a Comment