సంగీతం::K,V.మహాదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,పట్టాభి,కోరస్
పల్లవి::
ఊరేగినా వాడే..ఏ..ఊరేలినా వాడే..ఏ..
ఊరూ పేరున్న వాడు..ఉన్నవాడూ వాడే
మా వూరి దేవుడమ్మా
చల్లంగ మమ్మేలు రాముడమ్మా
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా
మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు
మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు
మహి లోపల దేముడై మహిమలెన్నో చూపినాడు
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా
చరణం::1
మహాప్రభో నీ మహిమ తెలియగా..మానవు లెంతటివారు
ఓ..మహాప్రభో నీ మహిమ తెలియగా..మానవు లెంతటివారు
పరమాత్మ నీ భజనకు పిలచితే..బద్దకమని పలికేరు
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని..చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని..చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని..చంచల మతులయ్యేరు
హరి..హరిలో రంగ హరి..వైకుంఠ వాసా హరి
హరిలో రంగ హరి హరి హరి హరి హరి
ఒక మాట ఒక బాణం అన్నాడు
ఒక సీతమ్మనే ఏలుకున్నాడు
ఒక మాట ఒక బాణం అన్నాడు
ఒక సీతమ్మనే ఏలుకున్నాడు
మడేలోడి మాటైనా మన్నించాడూ
మడేలోడి మాటైనా మన్నించాడూ
అడవికంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా
చరణం::2
ఓ హోయ్ రాములు సా హోయ్ సాములు
ఓ హోయ్ రాములు సా హోయ్ సాములు
పడతా పడతా నేను పప్పు దాకలో పడతా
పడతా పడతా నేను పాతర గోతిలో పడతా
సీతమ్మప్పో..హనుమంతప్పొ..హనుమంతప్పో..సీతమ్మప్పొ
ఓ హోయ్ రాములు సా హోయ్ సాములు
మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా..మా తండ్రులు రామయ్యలు
మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా..మా తండ్రులు రామయ్యలు
లేదూ రావణబాధ రాదు మాకు ఏ కొరత
లేదూ రావణబాధ రాదు మాకు ఏ కొరత
రాముడే దేముడైన రామాయణమే మా కథ
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా..ఆఆఅ
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా..ఆఆఅ
No comments:
Post a Comment