Tuesday, October 15, 2013

సిరి సిరి మువ్వ--1978





సంగీతం::K,V.మహాదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా 
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ

చరణం::1

పలకమన పలకదే పంచదార చిలక
కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక
ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా, పూచిన కొమ్మా 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా

చరణం::2

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడి బొమ్మా..పూచిన కొమ్మా 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా

సాకీ: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మవుంటే ఆ కాలి మువ్వనై పుడతాను
పుత్తడి బొమ్మా..పూచినకొమ్మా 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా

No comments: