Monday, October 14, 2013

సిరి సిరి మువ్వ--1978

సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు

కీరవాణి:::రాగం{హిందుస్తాని కర్నాటక} 

పల్లవి::

ఝణన ఝణన నాదంలో ఝుళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది 
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుం
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

చరణం::1

అమరావతి శిల్పంలో..అందమైన కళలున్నాయి
అవి..నీలో..మిల మిల మెరిసే..అరకన్నుల కలలైనాయి
అమరావతి శిల్పంలో..అందమైన కళలున్నాయి
అవి..నీలో..మిల మిల మెరిసే..అరకన్నుల కలలైనాయి
నాగార్జున కొండ కోనలో..నాట్యరాణి కృష్ణవేణి
నాగార్జున కొండ కోనలో..నాట్యరాణి కృష్ణవేణి
నీ విరుపుల మెరుపులలో..నీ పాదాల పారాణి 

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

చరణం::2

తుంగభద్ర తరంగాలలో..సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా..పొంగి పదం పాడిస్తుంది
తుంగభద్ర తరంగాలలో..సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా..పొంగి పదం పాడిస్తుంది
అచ్చ తెలుగు నుడికారంలా..మచ్చలేని మమకారంలా 
అచ్చ తెలుగు నుడికారంలా..మచ్చలేని మమకారంలా
వచ్చినదీ కవితా గానం..నీ విచ్చిన ఆరవ ప్రాణం 

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
a

No comments: