సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు
చక్రవాకం::రాగం
పల్లవి::
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
చరణం::1
వాన కురిసి కలిసేది..వాగులో
వాగువంక కలిసేది..నదిలో హ
వాన కురిసి కలిసేది..వాగులో
వాగువంక కలిసేది..నదిలో
కదిలి కదిలి నదులన్నీ..కలిసేది కడలిలో
కదిలి కదిలి నదులన్నీ..కలిసేది కడలిలో
కాని ఆ కడలి కలిసేది..ఎందులో
ఎవరికెవరు ఈ లోకంలో..ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో..ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో...ఓఓఓఓ
No comments:
Post a Comment