Sunday, October 27, 2013

బందిపోటు దొంగలు--1969




సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::దాశరథి 
గానం::ఘంటసాల
దర్శకత్వం::K.S.ప్రకాశరావు 
తారాగణం::అక్కినేని,S.V.రంగారావు, జగ్గయ్య, గుమ్మడి, నాగభూషణం,జమున,
కాంచన, రాజబాబు

పల్లవి::

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో 
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో..ఓ ఓ ఓ ఓ ఓ

చరణం::1

సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా 
అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా 
వెతికే పెదవులతో..తొణికే మధువులతో 
వెతికే పెదవులతో..తొణికే మధువులతో 
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ 
విరిసిన వెన్నెలవో..పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో..చెలీ చెలీ నీవెవరో 
విరిసిన వెన్నెలవో..ఓ ఓ ఓ ఓ ఓ 

చరణం::2

కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ...
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో 
ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో 
నడిచే తీగియవై..పలికే దీపికవై 
నడిచే తీగియవై..పలికే దీపికవై 
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో 
విరిసిన వెన్నెలవో..ఓ ఓ ఓ ఓ ఓ

No comments: