సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు
పల్లవి::
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే..రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే అని
పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే..రామ హరే శ్రీరామ హరే
చరణం::1
అలనాటి ఆ సీత ఈనాటి దేవత
శతకోటి సీతల కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా రామాబాణమే వదలరా
ఈ ఘోర కలిని మాపరా ఈ క్రూర బలిని ఆపరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే..రామ హరే శ్రీరామ హరే
చరణం::2
నటరాజ శత సహ్రస రవితేజా
నటగాయక వైతాళిక మునిజన భోజా
నటరాజ శత సహ్రస రవితేజా
నటగాయక వైతాళిక మునిజన భోజా
దీనావన భవ్య కళాదివ్య పదాంభోజా చెరి సగమై రస జగమై
చెలరేగిన నీ చెలి ప్రాణము బలిపశువై యజ్ఞవాటి
వెలి బూడిద అయిన క్షణము
సతీ వియోగము సహించక
దుర్మతి¸° దక్షుని మదమడంచగ
ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ధ్వనుల
నమక చమక యమ గమక లయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికట సటత్పద విస్ఫు లింగముల
విలయ తాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో
శివుడే అయితే రగిలిపో
No comments:
Post a Comment