Tuesday, November 01, 2011

అత్తలూ కోడళ్లు--1971















సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ, నాగభూషణం,సూర్యకాంతం, రాజబాబు, ఛాయాదేవి,నిర్మల

పల్లవి::

అమ్మమ్మో అత్తమ్మో..అమ్మమ్మో అత్తమ్మో 
ఇక్కడే పుట్టిన సంగతి..అప్పుడే మరవొద్దమ్మో 
ఇక్కడే పుట్టిన సంగతి..అప్పుడే మరవొద్దమ్మో
అంత మిడిసిపాటొద్దమ్మో..అహ హా హా హా
అమ్మమ్మో..ఓఓఓ..అత్తమ్మో

చరణం::1

రామా..కృష్ణా..అనే వయసులో రంగద్దాలు ఎందుకు
రామా..కృష్ణా..అనే వయసులో రంగద్దాలు ఎందుకు 
పాడి పంటలు అందించే పల్లెను తిడతా వెందుకు
పాడి పంటలు అందించే పల్లెను తిడతా వెందుకు 
పుట్టిన ఊరిని తిట్టేవారికి పుట్టగతులు లేవత్తమ్మో ఓయమ్మో
ఉన్నమాట నేనన్నానని..ఉరిమిచూడకే ఓయమ్మో   
అమ్మమ్మో అత్తమ్మో..ఆ ఆ ఆ ఆ..అమ్మమ్మో అత్తమ్మో 

చరణం::2
 
పిట్టల దొరలా రంగు రంగుల..బట్టల తొడిగే కుర్రోళ్ళు
రైకగుడ్డనే చొక్కాచేసి సోకులుచేసే..మొనగాళ్ళు
చదువు పేరుతో డబ్బులు గుంజి..జల్సా చేసే సోగ్గాళ్ళూ
అమ్మా..అయ్యా అమ్మా..అయ్యా..ఒదిలేస్తే 
దమ్మిడీకి కొరగారు..డుర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్
అమ్మమ్మో అత్తమ్మో..అమ్మమ్మో అత్తమ్మో 

చరణం::3

పిడకలు చేసిన ఆ చెయ్యే..పేడను చూసి కసిరింది
పొలాల తిరిగిన ఆ కాలే..బురదను చూసి బెదిరింది
పిడకలు చేసిన ఆ చెయ్యే..పేడను చూసి కసిరింది
పొలాల తిరిగిన ఆ కాలే..బురదను చూసి బెదిరింది
ఫ్యానుగాలిలో ఊరిన ఒంటికి..పైరగాలి సరిపోతుందా 
పట్నం మోజులు మరిగినవారికి..పల్లెటూరు పనికొస్తుందా 

అమ్మమ్మో అత్తమ్మో..అమ్మమ్మో అత్తమ్మో 
ఇక్కడే పుట్టినసంగతి..అప్పుడే మరవొద్దమ్మో 
అంత మిడిసిపాటొద్దమ్మో..ఓహో హో హో..
అమ్మమ్మో అత్తమ్మో..అహా     
అమ్మమ్మో అత్తమ్మో అమ్మమ్మో అత్తమ్మో 

No comments: