సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చరణం::1
పైటకొంగు చుట్టచుట్టి..పైటన్నం గంపనెట్టి
పైటకొంగు చుట్టచుట్టి..పైటన్నం గంపనెట్టి
కోక కాస్త ఎత్తికట్టి..గట్టుమీద నడుస్తుంటె
కోక కాస్త ఎత్తికట్టి..గట్టుమీద నడుస్తుంటె
నడక అందమా..ఆ నడుము అందమా
నడక అందమా..ఆ నడుము అందమా
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా
చరణం::2
పైరగాలి వీస్తుంటే..పంటచేలు వూగుతుంటే
పైరగాలి వీస్తుంటే..పంటచేలు వూగుతుంటే
ముందు ముందు పంట తలచి..మురిసిపోతు నువ్వుంటే
ముందు ముందు పంట తలచి..మురిసిపోతు నువ్వుంటే
నువ్వు అందమా..నీ గర్వమందమా
నువ్వు అందమా..నీ గర్వమందమా
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చరణం::3
ముద్ద నేను పెడుతుంటే..నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద నేను పెడుతుంటే..నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు..కొసరి నేను కోరుతుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు..కొసరి నేను కోరుతుంటే
కోరికందమా..నీ కోపమందమా
నా కోరికందమా..నీ కోపమందమా
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా
చీరకు రవికందమా..రవికకు చీరందమా
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా
No comments:
Post a Comment