Tuesday, November 01, 2011

బొమ్మా బొరుసా--1971







సంగీతం::R.గోవర్ధనం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,L.R.ఈశ్వరి
తారాగణం::రామకృష్ణ,చలం,చంద్రమోహన్, S. వరలక్ష్మి,స్నేహప్రభ, వెన్నీరాడై నిర్మల,రమాప్రభ 

పల్లవి::

ఆహాహాహాహా..ఆహాహాహాహా..ఆహాహాహాహా
ఒళ్లు జిల్లంటున్నది..గుండె ఝల్లంటున్నది
నా జిలుగు చీర నీటిమీద..అలలా వలలా తేలుతున్నది
ఆహాహాహాహా..ఆహాహాహాహా..ఆహాహాహాహా
ఒళ్లు జిల్లంటున్నది..గుండె ఝల్లంటున్నది
నా చిలిపిపైట ఒంటిమీద..నిలువను నిలువనన్నది
ఆహాహాహాహా..ఆహాహాహాహా..ఆహాహాహాహా
ఓ మల్లీ ఆహాహా..ఓ లిల్లీ ఆహాహా

చరణం::1

నన్నే చూశాడొక చిన్నోడు..కన్నే వేశాడా గడుసోడు..ఆ    
నన్నే చూశాడొక చిన్నోడు..కన్నే వేశాడా గడుసోడు
మెత్తగా..ఆ..నవ్వుకున్నాడు..మెల్లగా..ఆ..అందుకున్నాడు
మెత్తగా..ఆ..నవ్వుకున్నాడు..మెల్లగా..ఆ..అందుకున్నాడు..హా
అమ్మాయీ..ఆహాహా..ఓ అమ్మాయీ..నీ బుగ్గలు అద్దాలే నన్నాడు
తన నీడ చూసుకున్నాడు..అది తలచుకుంటే అది తలచుకుంటే
ఇంకా ఇంకా గిలిగింతగ వున్నది..గిలిగింతగ వున్నది..ఆహాహా..ఆహాహా
ఒళ్లు జిల్లంటున్నది..గుండె ఝల్లంటున్నది
నా చిలిపిపైట ఒంటిమీద..నిలువను నిలువనన్నది

చరణం::2

నన్నే వలచాడొక వన్నెకాడు..నా వెంట నడిచాడా సోగ్గాడు..ఆహా
నన్నే వలచాడొక వన్నెకాడు..నా వెంట నడిచాడా సోగ్గాడు
నాగులా..ఆ..చేరుకున్నాడు..తీగలా..ఆ..అల్లుకున్నాడు
నాగులా..ఆ..చేరుకున్నాడు..తీగలా..ఆ..అల్లుకున్నాడు
అలాగా బేబీ..ఈ..హయ్ హయ్ హయ్..హయ్..
బేబీ..నీ పెదవులే..గులాబిరేకులన్నాడు
ఒక ముద్దు..బదులిమ్మన్నాడు
అది తలచుకుంటే..అది తలచుకుంటే
చన్నీరే సలసల మంటున్నది..సలసల మంటున్నది..అహా 
ఒళ్లు జిల్లంటున్నది..గుండె ఝల్లంటున్నది
నా జిలుగు చీర నీటిమీద..అలలా వలలా తేలుతున్నది
ఓహోహో..ఓఓఓ..ఓహో..ఓహోహో..ఓఓఓ..ఓహోహో..

సంగీతం::R.గోవర్ధనం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::స్వర్ణలత



వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా 
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా
నన్నొదిలీ పోదువటే..నామీదా కోపమటే 
నన్నొదిలీ పోదువటే..నామీదా కోపమటే
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా

వేసవి వస్తే ఊటీకి వెళతా..పిచ్చి పట్టితే వైజాగుపోతా..ఆ
లవ్వు ముదిరితే నీ చెంత కొస్తా..నువు కాదంటే నూతిలో పడతా
తళుకూ కులుకూ వేషం మోసం..రూపెత్తి నీవైతివా
ఓ..ఓ..వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా

No comments: