Tuesday, November 01, 2011

బొమ్మా బొరుసా--1971

సంగీతం::R. గోవర్ధనం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,పిఠాపురం నాగేశ్వరరావు
తారాగణం::రామకృష్ణ,చలం,చంద్రమోహన్, S. వరలక్ష్మి, స్నేహప్రభ,వెన్నీరాడై నిర్మల,రమాప్రభ

పల్లవి::

బొమ్మా బొరుసా పందెం వెయ్యి  
నీదో నాదో పై చెయ్యీ..ఈఈఈఈ 
కమాన్..క్లేప్..వన్..టూ

బొమ్మా బొరుసా పందెం వెయ్యి..నీదో నాదో పైచెయ్యీ

బొమ్మయితేనే నీ గెలుపు..బొరుసయితేనూ నా గెలుపు

చరణం::1

డబ్బుంటే గద పైకెగ రేయడం..అది లేందెందుకు ఊరక డంబం..ఓహో హో
డబ్బుంటే గద పైకెగ రేయడం..అది లేందెందుకు ఊరక డంబం
సాగిన్నాడూ సర్దాగుండూ..ఎదురు తిరిగితే ఏముండూ
నడమంత్రపు సిరీ వచ్చిన్నాడూ..నెత్తికి కళ్ళూ వచ్చును చూడూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి..నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు..బొరుసయితేనూ నా గెలుపు

చరణం::2

చంకీ లేందే జడవదు గుర్రం..గోతిలో పడితే లంగడా గుర్రం

చల్‌రే బెటా చేల్..  
చంకీ లేందే జడవదు గుర్రం..గోతిలో పడితే లంగడా గుర్రం 
హద్దు మీరితే హడవాగుర్రం..అదుపులో వుంటే జట్కాగుర్రం
సాధుకు కోపం రేగినప్పుడూ..వధ బట్టందే వదలి పెట్టడూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి..నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు..బొరుసయితేనూ నా గెలుపు

చరణం::3

పిండుంటే గద రొట్టె చెయ్యడం..కొప్పుంటే గద పూలు పెట్టడం..ఓహో..
పిండుంటేగద రొట్టె చెయ్యడం..కొప్పుంటే గద పూలు పెట్టడం 
చమురంటే గద దీపమెలగడం..డబ్బుంటే గద డాబుచెల్లడం
ఆడపెత్తనం ఎన్నాళ్లు సాగూ..గుట్టుతెలిస్తే చిటికెలో ఆగు 

No comments: