Sunday, December 04, 2011

హాపీ....బర్త్..డే...టూ..యూ....ఘంటసాలగారు...



ఇవాళ మన ఘంటసాల గారి పుట్టినరోజు
వారి గానంతో మన ప్రతి హృదయాన్నీ
అలరించిన స్వరగాన మాధుర్యాల స్వర్ణాలయం
గళములో అమౄతాన్ని నింపుకొన్న అమరగాయకుడు
మన ఆంధ్రుల గుండెలో చిరంజీవిగా ఉంటున్న గళ వేల్పు
అందరి మనస్సులను తన గానంతో ఓలలాడించిన గాన ఘననీయుడు
4-12-1922)ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారి 89వ పుట్టినరోజు..ఇన్ని సంవత్సరాలు తన గాన మాధుర్యంతో
మనల్ని ఓలలాడించిన మన ఘంటసాల గారి పాటలు
మనము పాడుకుందామా..

హాపీ....బర్త్..డే...టూ..యూ....ఘంటసాల...


ఆనందనిలయం
సంగీతం::పెండ్యాల
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాలగారు


పదిమందిలో పాట పాడినా..ఆ..
అది అంకిత మెవరో ఒకరికే..
విరితోటలో..పూలెన్ని పూచినా
గుడికి చేరేది నూటికి ఒకటే..ఎ..ఎ..
పదిమందిలో పాట పాడినా..
అది అంకిత మెవరో ఒకరికే..

గోపాలునికి ఎంతమంది గోపికలున్న..గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే..ఏ..
గోపాలునికి ఎంతమంది గోపికలున్న..గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
ఆకాశ వీధిలో తారలెన్ని వున్నా..అందాల జాబిల్లి అసలుఒక్కడే

పదిమందిలో పాట పాడినా..
అది అంకిత మెవరో ఒకరికే..

ఏడారిలో ఎన్ని ఋతువులున్నను..వేడుక చేసే వసంతమొక్కటే
ఏడారిలో ఎన్ని ఋతువులున్నను..వేడుక చేసే వసంతమొక్కటే
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
ఆ కలిమి కారణం..నీ ప్రేమ ఒక్కటే

పదిమందిలో పాట పాడినా..
అది అంకిత మెవరో ఒకరికే..
విరితోటలో..పూలెన్ని పూచినా
గుడికి చేరేది నూటికి ఒకటే..ఎ..ఎ..
పదిమందిలో పాట పాడినా..
అది అంకిత మెవరో ఒకరికే..

పసుపు కుంకుమ--1955
రచన:::అనిసెట్టి సుబ్బారావు
సంగీతం::M.రంగారావు
గానం::ఘంటసాల



పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ...ఆ
నీవేనా! నిజమేనా!
నీవేనా! నిజమేనా!
జీవన రాణివి నీవేనా
నా జీవన రాణివి నీవేనా

చరణం::1
పూల తీగవో పొంగే నదివో
తళుకు మెరుపువో తలికి వెన్నెలవో
పూల తీగవో పొంగే నదివో
తళుకు మెరుపువో తలికి వెన్నెలవో
మమత గొలుపు అందాల సునిథివో
మమత గొలుపు అందాల సునిథివో
అరుగ యవ్వనానందపు సుధవో
నీవేనా! నిజమేనా!

చరణం::2

నీలి నీడలో నీ ముంగురు
కమలములో నీ నయనములో
నీలి నీడలో నీ ముంగురు
కమలములో నీ నయనములో
మరుని విల్లు ఇరువైపుల సాగిన
మరుని విల్లు ఇరువైపుల సాగిన
విరుల తూపులో వాలు చూపులో
నీవేనా! నిజమేనా!

చరణం::3

చిందు రవళిలో కలల శయ్యపై
నను వరించు నవ మోహినివేమో
చిందు రవళిలో కలల శయ్యపై
నను వరించు నవ మోహినివేమో
అఖిలావనిలో శోభవింపగా
చిందు రవళిలో కలల శయ్యపై
నను వరించు నవ మోహినివేమో
అఖిలావనిలో శోభవింపగా
చిందు రవళిలో కలల శయ్యపై
నను వరించు నవ మోహినివేమో
అవతరించిన దేవతవేమో
నీవేనా! నిజమేనా! జీవన రాణివి నీవేనా
నా జీవన రాణివి నీవేనా ..నిజమేనా..



పూజా ఫలము--1964
రచన::D.C.నారాయణ రెడ్డి
సంగీతం::S.రాజేశ్వరరావు
గానం::ఘంటసాల


పల్లవి::
నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో..
తెలియరాని రాగమేదో
తీగె సాగెనెందుకో..
తీగెసాగెనెందుకో, నాలో
నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో..

చరణం::1
పూచిన ప్రతి తరువొక వధువు
పువు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో..

నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో..

చరణం::2
తెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..ఏ..

నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో..

చరణం::3
పసిడి అంచు పైట జారా..ఆఆ..ఓఓ..
పసిడి అంచు పైట జార
పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే
పరవశించెనే..ఏ..

నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో..



2 comments:

voleti said...

అమరగాయకుడు ఘంటసాల గారు మన తెలుగు వారైనందుకు చాలా గర్వపడుతున్నాను..ఆ మహానుభావునికి నా జోహార్లు...
మీ పోస్టులో రాసిన 89 సంవత్సరాలు ఏమిటో అర్ధం కాలేదు.

srinath kanna said...

నమస్తే ఓలేటి గారు
నా బ్లాగును మీరు సందర్శించినందుకు
చాలా చాలా కృతజ్ఞతలు

మీరు రాసిన ఆ 89?
నేను చేసిన ఒక పొరపాటండి
ఒక లైన్ రాసి పోస్ట్ చెసే ముందు ఎదో మిష్టేక్
జరిగి కనపడకుండగ పొయింది
అందుకే మీకు అర్థం కాలేదు..దయచేసి క్షమించండి
అది ఇప్పుడు కరెక్ట్ చేసాను,,చాలా థాంక్స్ అండీ మీకు
ఇలాగే వస్తూపోతూ ఉండాలని నా ఆశ..

ప్రేమతో
శక్తి