సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
ఇల్లే కోవెల..చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ వనితే..వనిత
ఇల్లే కోవెల..చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే..వనిత..ఇల్లే కోవెల.
నుదుట కుంకుమరేఖ..కంటికి కాటుకరేఖ..
నుదుట కుంకుమరేఖ..కంటికి కాటుకరేఖ
జడలో తెల్లని విరులు..యువతికి తరగని సిరులు
జడలో తెల్లని విరులు..యువతికి తరగని సిరులు
ఇల్లే కోవెల..చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే..వనిత..ఇల్లే కోవెల.
తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
చెలుని నవ్వుల స్నేహము
చెలుని నవ్వుల స్నేహము
నెలతకు జీవన భాగ్యము
ఇల్లే కోవెల..చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే..వనిత..ఇల్లే కోవెల.
చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
ఇల్లే కోవెల..చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే..వనిత..ఇల్లే కోవెల.
No comments:
Post a Comment