Monday, September 26, 2011

సంకీర్తన --1987




సంగీతం::ఇళయరాజ
రచన::సిరివెన్నెల
గానం::బాలు,జానకి

మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిను చేరి ఓ కమ్మని ఊసును తెలిపేనే
కవితవు నీవై..పరుగున రా..ఎదసడితో నటియించగ..రా
స్వాగతం సుస్వాగతం..స్వాగతం సుస్వాగతం

కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావో
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
మీ నృత్యం చూసి నిజంగా..ఉం నిజంగా

చరణం1:

మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది
వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ
వయ్యారాల గౌతమి ఈ కన్యా రూప కల్పన
వసంతాల గీతమే నన్నే మేలుకొల్పినా
భావాలపూల రాగాలబాట నీకై వేచేనే

కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
ఎదో స్వరగతి నూతన పదగతి చూపేను నను శృతిచేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
ఎదో స్వరగతి నూతన పదగతి చూపేను నను శృతిచేసి
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు

చరణం2:

లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం
మరందాల నాదమే
మరందాల నాదమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే నీ మ్రోల

కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
ఎదో స్వరగతి నూతన పదగతి చూపేను నను శృతిచేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు


Sankeerthana--1987
Music::Ilayaraja
Lyricist::Sirivennela Sitarama Sastry
Singer's::S.P.Balu,S.Janaki
Cast::Nagarjuna,Ramyakrishna. 

:::

manasuna molichina sarigamale
ee galagala nadakala taragaluga
na kalalanu mosuku ninucheri
oo kammani usuni telipene
kavitavu neevai paruguna raa
yeda sadito natiyinchaga raa
swagatam suswagatam
swagatam suswagatam


kuku chuku chuku kuku chuku chuku
kuku chuku chuku kuku
raraa swaramula sopanamulaku
padalanu jata chesi
kukuku kukukkuu keertana toli amanivai raa
piliche chilipi koyilaa yeta dagunnavo
kuku chuku chuku kuku chuku chuku
kuku chuku chuku kuku

me nrutyam chusi nijamgaa..nijamgaa

muvvala ravali pilichindi
kavita badulu palikindi
kala nidura chedirindi
manasu kalanu vetikindi
vayyarala goutami
vayyarala goutami ee kanyaarupa kalpana
vasantala geetine nanne melukolpina
bhaavaala pula ragala bata neekai vechene
kuku chuku chuku kuku chuku chuku
kuku chuku chuku kuku
yedo swaragati nutana padagati chupenu nanu shruti chesi
idi na madi sankeertana kukukuu kukukku
sudhaluure yalaapana kukuku kukukku

lalita lalita padabandham madini
madhura sumagandham
chalita mrudula padalaasyam
avani adhara darahaasam
marandaala ganame
marandaala ganame mrudangala nadamu
prabandhala praname natincheti paadamu

meghala dari uregu uuha vale ee mrola

No comments: