సంకీర్తన 1987
సంగీతం::ఇళయరాజ
రచన::సిరివెన్నెల
గానం::జేసుదాస్
ఏ నావదే తీరమో..
ఏ నేస్తమే జన్మ వరమో!
ఏ నావదే తీరమో..
ఏ నేస్తమే జన్మ వరమో!
కలగానో..ఓ..కథగానో..ఓ..
మిగిలేది నీవే..ఈ జన్మలో!
ఏ నావదే తీరమో..
ఏ నేస్తమే జన్మ వరమో!
నాలోని నీవే నేనైనాను..నీలోని నేనే నీవైనావు
నాలోని నీవే నేనైనాను..నీలోని నేనే నీవైనావు
విన్నావా ఈ వింతను..అన్నారా ఎవరైననూ
విన్నావా ఈ వింతను..అన్నారా ఎవరైననూ
నీకూ..నాకే..చెల్లిందనూ..!
ఆకాశమల్లే నీవున్నావు..నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లే నీవున్నావు..నీ నీలి రంగై నేనున్నాను
కలిసేది ఊహేననూ..ఊహల్లో కలిశామనూ
నీవూ..నేనే..సాక్ష్యాలనూ..!
No comments:
Post a Comment