Monday, September 26, 2011

బడిపంతులు--1972

సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు

కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు

గుర్ గుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ

ఎక్కడ వున్న ఎవ్వరినైనా..ఎక్కడ వున్న ఎవ్వరినైనా
పలుకరించి కలుపుతాడు

బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు

తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ

కులము మతము జాతేదైనా..కులము మతము జాతేదైనా

గుండెలు గొంతులు ఒకటంటాడు

బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు

డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు

ఒకే తీగ పై నడిపిస్తాడు..ఒకే ప్రపంచం అనిపిస్తాడు

No comments: