పాట ఇక్కడ వినండి
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
ఓ తీయని మనసు నాదేనా
ఓ పోయే పోయే చినదాన
నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ
కాయా పండా నెరజాణా..అ అ అ
ఓ పోయే పోయే చినదాన..ఆ..
ఘుమ ఘుమ పూవులు జడలోన
గుస గుసలాడే చెవిలోన
ఘుమ ఘుమ పూవులు జడలోన
గుస గుసలాడే చెవిలోన
అది యేమో తెలుసుకుని
అలుగుట తగునా నా పైన..అ అ
ఓ పోయే పోయే చినదాన
నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ
కాయా పండా నెరజాణా..అ అ అ
కులుకులు తళుకులు నీలోన
జిలిబిలి సరసములాడేనా
కులుకులు తళుకులు నీలోన
జిలిబిలి సరసములాడేనా
ఒయ్యారీ..సయ్యాట
ఒంటిగ ఆడుట సరిఔనా..అ అ..
ఓ పోయే పోయే చినదాన
నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ
కాయా పండా నెరజాణా..అ అ అ
సొగసుల మోమును ముడుచుకొని
చురచుర చూడకె వగలాడి
సొగసుల మోమును ముడుచుకొని
చురచుర చూడకె వగలాడి
ఇతగాడే..జతగాడూ
ఇద్దర మొకటే ఎపుడైనా
ఓ పోయే పోయే చినదాన
నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ
కాయా పండా నెరజాణా..అ అ అ
ఓ పోయే పోయే చినదాన...
No comments:
Post a Comment