సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
ఆనంద భైరవి::రాగం
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఉపకారాలే చేసితినో..ఎరగక అపచరాలే చేసితినో
ఉపకారాలే చేసితినో..ఎరగక అపచరాలే చేసితినో
ఒడుదుడుకులలో తొడై ఉంటిని..మీ అడుగున అడుగై నడిచితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి..
పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలొనా ప్రమిదగ వెలిగే వరమడిగితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
No comments:
Post a Comment