Monday, September 26, 2011

బడిపంతులు--1972



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా

అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా!


అతడు::పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను
పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను

ఆమె::పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు
పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు

అతడు::పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు
పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు

ఆమె::చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు
చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు

అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా!

అతడు::ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి
ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి


ఆమె::ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి
ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి


అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా!

No comments: