Saturday, September 10, 2011

మంగమ్మగారి మనవడు--1984




సంగీతం::KV.మహాదేవన్
రచన::C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
నటీ నటులు::బాలకృష్ణ,భానుమతి,సుహాసిని,గొల్లపూడి,గోకిన రామారావు,బాలాజి

చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు
తన అందం నీలో చూసి తడబడి పోయాడు తాబ్బిబ్బయ్యాడు
అవునా..ఏమో
అవునా..ఏమో

గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది
గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది
తన వేగం నీలో చూసి తడబడి పోయింది తాబ్బిబ్బయ్యింది
అవునా..ఏమో
అవునా..ఏమో

ఎవరికి లొంగని మగసిరీలో
ఎన్నడు కరగనీ సుగుణమ్ లో
ఎవరికి లొంగని మగసిరీలో
ఎన్నడు కరగనీ సుగుణమ్ లో
రాముడివే నీవు..ఆ రామునివే నీవు
ఏ రాముడు?
అగ్గి రాముడా
బండ రాముడా
అడవి రాముడా
శృంగార రాముడా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
అయోధ్య రాముడివే
ఆ సీతా రాముడివే

గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది
తన వేగం నీలో చూసి తడబడి పోయింది తాబ్బిబ్బయ్యింది

భామలు మెచ్చిన రశికథలో
ప్రేమలు పంచిన చతురతలో
భామలు మెచ్చిన రశికథలో
ప్రేమలు పంచిన చతురతలో
కృష్నూడివే నీవు ఆ కృష్నూడివే నీవు
ఏ కృష్ణుడు ?
చిలిపి కృష్ణుడా
కొంటె కృష్ణుడా
భలే కృష్ణుడా
గోపాల కృష్ణుడా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
బృందావనా కృష్ణుడివే
ఆ రాధా కృష్ణుడివే

చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు
తన అందం నీలో చూసి తడబడి పోయాడు తాబ్బిబ్బయ్యాడు
ఆ హా..ఆ..హా..ఆ హా..ఆ హా...

No comments: