పాట ఇక్కడ వినండి
సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::T.Lelin Babu
తారాగణం::కృష్ణంరాజు,జయంతి,ప్రమీల,అల్లు రామలింగయ్య,రమాప్రభ,రావుగోపాలరావు,గుమ్మడి.
K.V. చలం
పల్లవి::
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే..ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే..ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
చరణం::1
ఎన్నడు అందని..పున్నమి జాబిలి
ఎన్నడు అందని..పున్నమి జాబిలి
కన్నుల ముందే..కవ్విస్తుంటే
కలగా తోచి వలపులు పూచి
కలగా తోచి వలపులు పూచి
తనువే మరచి తడబడుతుంటే
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే..ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
చరణం::2
గుడిలో వెలసిన దేవుడు ఎదురై
గుడిలో వెలసిన దేవుడు ఎదురై
కోరని వరాలే అందిస్తుంటే
ఆ భావనలో ఆరాధనలో
ఆ భావనలో ఆరాధనలో
అంతట నీవే అగపడుతుంటే
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే..ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను..ఇంకెలా తెలుపను
పాట ఇక్కడ వినండి
No comments:
Post a Comment