Saturday, September 10, 2011

గుడిగంటలు--1964




సంగీతం::ఘంటసాల
రచన::అనిసెట్టి-ఆత్రేయ
గానం::ఘంటసాల

జన్మమెత్తితిరా అనుభవించితిరా
జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా
మంచి తెలిసి మానవుడుగ మారినానురా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా)
స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా
సమరభూమి నా హృదయం శాంతి పొందెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విశముగ్రక్కెరా
క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విశముగ్రక్కెరా
ధర్మజ్యోతి తల్లి వోలె ఆదరించెరా
ధర్మజ్యోతి తల్లి వోలె ఆదరించెరా
నా మనసె దివ్యమందిరముగ మారిపోయెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిశియందె మహాత్ముని కానగలవురా
మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిశియందె మహాత్ముని కానగలవురా
ప్రతి గుండెలొ గుడిగంటలు ప్రతిధ్వనించురా
ప్రతి గుండెలొ గుడిగంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్యస్వరం న్యాయపథం చూపగలుగురా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా
బ్రతుకు సమరములో పండి పోయితిరా

No comments: