Saturday, September 10, 2011

గుడిగంటలు--1964




సంగీతం::ఘంటసాల
రచన::అనిసెట్టి-ఆత్రేయ
గానం::ఘంటసాల,(సుశీల)

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ హహహా

నీలోన నన్నే నిలిపేవు నేడే
ఏ శిల్పి కల్పనవో..ఏ కవి భావనవో

నీలోన నన్నే నిలిపేవు నేడే
ఏ శిల్పి కల్పనవో..ఏ కవి భావనవో

ఆహహా..ఓ హోహో.....ఆ ఆ
ఎల్లోరా గుహలో పిల్ల ఉంది నీలో
నండూరివారి ఎంకి ఉంది నీలో


ఎల్లోరా గుహలో పిల్ల ఉంది నీలో
నండూరివారి ఎంకి ఉంది నీలో

అల విశ్వనాథ చెలి కిన్నెరుంది
మా బాపిరాజు శశికళ ఉంది

నీలోన నన్నే నిలిపేవు నేడే
ఏ శిల్పి కల్పనవో..ఏ కవి భావనవో

ఆహహా..ఓ హోహో.....ఆ ఆ

ఖయ్యాము కొలిచే సాకివి నీవే
కవి కాళిదాసు శకుంతల వీవే
ఆహహా..ఓ హోహో.....ఆ ఆ

ఖయ్యాము కొలిచే సాకివి నీవే
కవి కాళిదాసు శకుంతల వీవే

తొలి ప్రేమదీపం వెలిగించినావే
తొలి పూలబాణం వేసింది నీవే

నీలోన నన్నే నిలిపేవు నేడే
ఏ శిల్పి కల్పనవో..ఏ కవి భావనవో

No comments: