Saturday, September 10, 2011

గుడిగంటలు--1964




సంగీతం::ఘంటసాల
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల

నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో

నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే

మబ్బుల పందిరి మనపై నిలిచే..ఎందుకు నిలిచే !
పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే..ఏమని పిలిచే!
వీడని జంటగ రమ్మనీ..వసి వాడని పూలై పొమ్మనీ

నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే

తెలియరానిది ఈ గిలిగింత..ఏ గిలిగింత!
పలుకలేనిది ఈ పులకింత..ఏ పులకింత!
కనుపించనిదా వింతా!..అది కదలాడును మనసంతా

నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో

చల్లగ తాకే జ్వాలలు ఏ..వో ఏమో ఏవో!
వేడిగ సోకే వెన్నెలలు ఏవో..ఏమో ఏవో!
చిన్నది విరిసే చూపులు..చెలి చిలికిన ముసి ముసి నవ్వులు

నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో

1 comment:

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి said...

ఎంత మధురమైన పాట అండి..ఆహా ...మీకు థాంక్స్ అండి !!