Saturday, September 10, 2011

మేమూ మనుషులమే--1973
























పాట ఇక్కడ వినండి

మీకు అన్నీ మాంచి మాంచి 60's 70's 80's

పాటలు వినాలని ఆశగా ఉందా?

www.chimatamusic.com

ఈ link ని ఒక్క నొక్కు నొక్కి site లోపల ప్రవేశించండి

మీకు నచ్చిన గని..పాటల ఖజాన మీకు Welcome చెపుతుంది

అందులొ మీరు కోరిన పాటలు వింటూ ఆనందించండీ lyrics

కావాలంటే నా BLOG నే సందర్శించండీ



సంగీతం::M.S విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు P.సుశీల


పల్లవి::

అతడు:- ఏమంటున్నది యీ గాలీ

ఆమె:- ఎగిరే పైటను అడగాలీ
అతడు:- ఏమంటున్నది యీ గాలీ
ఆమె:- ఎగిరే పైటను అడగాలీ
అతడు:- ఎగిరే పైటను ఏం చెయ్యాలి
ఆమె:- ఇంకో కొంగుకు ముడివెయ్యాలి
ఇద్దరు:- హ హ హా హా హా
అతడు:- ఎగిరే పైటను ఏం చెయ్యాలి
ఆమె:- ఇంకో కొంగుకు ముడివెయ్యాలి

అతడు:- ఏమంటున్నది యీ గాలీ
ఆమె:- ఎగిరే పైటను అడగాలీ

చరణం:: 1

అతడు:- పైటకు తెలుసు చాటున పొంగే ప్రాయం రెపరెపలూ
ఆమె:- గాలికి తెలుసూ విరిసీ విరియని పూవుల ఘుమఘుమలూ
అతడు:- ఊగే నడుమూ సాగే జడతో వేసెను పంతాలూ
ఆమె:- నీలో వుడుకూ నాలో దుడుకూ చేసెను నేస్తాలూ

అతడు:- ఏమంటున్నది యీ గాలీ
ఆమె:- ఎగిరే పైటను అడగాలీ

చరణం:: 2

అతడు:- మబ్బు మబ్బుతో ఏకమైనది..సాయం సమయములో
ఆమె:- మనసు మనసులో లీనమైనది..మమతల మైకంలో
అతడు:- అల్లరి కళ్లూ వెన్నెల నవ్వూ పెట్టెను గిలిగింతా
ఆమె:- వెచ్చని వొడిలో ఇచ్చిన చోటున ఇమిరెను జగమంతాఇమిరెను జగమంతా...

అతడు:- ఏమంటున్నది యీ గాలీ
ఆమె:- ఎగిరే పైటను అడగాలీ
ఆమె: - అహహాహా..హా..హా..

అతడు:- లాలలాలా
ఆమె:- అహహాహా..హా..హా..
అతడు:- లాలలాలా
ఇద్దరు:- అహహాహా..హా..హా..

1 comment:

Dr.Suryanarayana Vulimiri said...

శక్తి, "కొంగును" కు బదులు "కొంగుకు"; "సమయంలో" కు బదులు "సమయములో" అని వుండాలి.