సంగీతం::రమేష్ నాయుడు
Director::Vijayanirmala
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,చంద్రమోహన్,S.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ
పల్లవి::
చేనుకు గట్టుందీ..యింటికి గడపుందీ
కంటికి రెప్పుందీ..కన్నెకు హద్దుంది
హద్దుమీరినా..కాలుజారినా అంతా
గల్లంతవుతుందీ..గల్లంతవుతుంది..వాట్
అమ్మమ్మమ్మమ్మో అమ్మాయిగారండీ
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి వెళ్ళండి
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి వెళ్ళండి
చరణం::1
పల్లెటూరిలో బస్తీనడకలు..మార్చుకోవాలి
కళ్ళూ కాళ్ళూ నేలమీదనే..వుంచుకోవాలి
ముళ్ళుంటాయి..రాళ్ళుంటాయి..ఎత్తూ పల్లాలుంటాయి
మొండితనంగా..పరుగులుతీస్తే..ముందరి పళ్ళే రాల్తాయి
అమ్మమ్మమ్మమ్మో అమ్మాయిగారండీ..ఆగండి చూడండి
ఆ పైన వెళ్ళండి..ఆగండి చూడండి ఆ పైన వెళ్ళండి
చరణం::2
పంజరంలో చిలకకుమల్లే..పెరిగావిన్నాళ్ళు
రెక్కలు వచ్చాయనుకుని..ఎగిరే వచ్చావీనాడు
పంజరంలో చిలకకుమల్లే..పెరిగావిన్నాళ్ళు
రెక్కలు వచ్చాయనుకుని..ఎగిరే వచ్చావీనాడు
నువ్వనుకున్నట్టే..అన్నీ జరగవు
నీకిష్టంలేదని ఏవీ..ఆగవు
అమ్మమ్మమ్మమ్మో..అమ్మాయిగారండీ
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి వెళ్ళండి
No comments:
Post a Comment