Sunday, September 12, 2010

శివరంజని--1978






సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ
గానం::SP.బాలు,P.సుశీల


నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు

నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై

నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లికగా
చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయక లో..

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నీ వడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై

అందాలే నీ హారితిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో..

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

No comments: